Singer Sunitha : తెలుగు పరిశ్రమలో సునీతకు అంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓ వైపు సింగర్‌గా, మరో వైపు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన తీయని గొంతుతో లక్షలాది మంది తెలుగు ప్రజల మనసులను కొల్లగొట్టింది. ఇక ఈమె కొంకాలం క్రితం రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది.
Singer Sunitha : వివాహం తరువాత సునీత ఇలా గడుపుతోంది.!
సదరు విలేఖరి పెళ్లి తర్వాత మ్యారెజ్ లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. సునీత ఈ విధంగా స్పందించింది.. “పెళ్లి తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది కదా. నా జీవితం నాకు నచ్చినట్లుగా బతకాలనుకున్నాను. ఇపుడు ఆ విధంగానే బతుకుతున్నాను. నా జీవితంపై నాకు ఓ క్లారిటీ ఉంది. ఇక ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు ఎప్పుడైనా సాయం కావాలంటే చేస్తా. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తా అని పేర్కొంది.
బాలు గారి గురించి సునీత స్పందన ఇదే..
ఇక గత ఏడాది జరిగిన విషాదాలపై సునీత స్పందిస్తూ.. కొంచెం బాధ పడింది. “గత సంవత్సరం ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా బాలు గారిని కోల్పాయాను. ఆ విషాదం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది కానీ అంతలా నన్నేమీ కదిలించడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది.!” అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.