Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత Singer Sunitha ఉపద్రష్ట ఇటీవల కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆమె వివాహం జరిగినప్పటి నుంచి అందరిలోనూ ఉన్న సండేదం ఏమిటంటే సునీతకు రామ్ వీరపనేని కి ఎంత ఏజ్ గ్యాప్ ఉంది అనేది. రామ్ వీరపనేని గారి వయసు 47 ఏళ్ళు. అలాగే సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇరువురి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ కేవలం ఐదేళ్లు మాత్రమే.
అందం విషయంలో సునీత మన తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఈమె కెరీర్ లో ఈమెకు చాలా సార్లు హీరోయిన్ ఆఫర్లు వచ్చాయట. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకు కొన్ని లక్షల మంది ఫాన్స్ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈమె తన స్వరంలోని మాధుర్యంతో ఎంతో మందిని మంత్రముగ్ధులను చేసింది. ఇంతటి అందం ఉన్న సునీతకి ఎందుకు ఎప్పుడూ హీరోయిన్ ఛాన్స్ రాలేదు చాలామందికి డౌట్ వచ్చింది.
సునీత కి గతంలో చాలానే హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె వాటిని చాలా సున్నితంగా తిరస్కరించారు. సునిత సినీ జీవితం ఆరంభంలోనే ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు ఈమెను హీరోయిన్గా నటించమని ఆఫర్లు ఇచ్చారట. చివరికి, ఆమెకు గాయనిగా తెలుగు సినీ పరిశ్రమలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారే సునీతకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చినప్పటికీ తనకు గాయనిగా ఈ జీవితం బావుందని ఆ జీవితం వద్దని సమాధానం ఇచ్చి ఆ అవకాశాన్ని వద్దు అనుకున్నారట. అలాగే ఇటీవల ప్రముఖ దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ కూడా సునీతకి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడట. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాలో నటించమని అడిగారట. డైరెక్ట్ గా దానికి కూడా ఆమె నో చెప్పేశారట.