Singer Sunitha: ఇన్ స్టా లో కొద్దీ నిమిషాల క్రితం ఫ్యామిలీ ఫోటో పెట్టిన సింగర్ సునీత .. చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే నమ్మండి..

Share

Singer Sunitha: ప్రముఖ మహిళ గాయని సునీత గురించి తెలియని వారు ఉండరు. ఆమె పాట వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది. ఎన్నో పాటలు పాడిన సునీత వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇద్దరు పిల్లలను పెంచి పోషించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకుని వచ్చిన తరువాత రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకున్నారు సునీత. అయితే ఈరోజు ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేనిల పెళ్లి రోజు. ఈ సందర్బంగా సింగర్ సునీత తన భర్త గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో తన భర్త రామ్‌ గురించి ఎంతో గొప్పగా సునీత చెప్పుకొచ్చారు. తన భర్త మంచి మనసున్న వ్యక్తి అని.. గడచిన సంవత్సరంలో తన జీవితంలో ఎన్నో మధురమైన అనుభూతులు అందించారని ఆమె చెప్పారు. పెళ్లి రోజు సందర్భంగా తన పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కూడిన ఒక స్పెషల్‌ వీడియోను సునీత సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు.

Singer Sunitha: అసలు వీడియోలో ఏమి ఉందంటే…!

ఈ వీడియోలో సింగర్ సునీత తల్లి మాట్లాడుతూ సునీత ఒక డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కూతురు బరువు బాధ్యతలన్నీ నెరవేరుస్తూ.. చిరునవ్వు, సహనంతో జీవితంలో ముందడుగు వేసిందని గర్వంగా వివరించారు. తన బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే ఈ పెళ్లి రోజు సందర్భంగా తల్లి ఒక్కరే కాకుండా పిల్లలు, భర్తతోపాటు బంధువులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే ఈ వీడియోలో సునీత తన భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేశారు. తన భర్త ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటారని, అలాగే నిజాయితీపరుడని చెప్పారు.

తనకు, రామ్ కు మధ్య ఎనిమిదేళ్ల నుంచే పరిచయం ఉందని.. అతనొక మంచి కాఫీ లాంటి అబ్బాయ్‌ అని రామ్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు సునీత రామ్ లకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మీరు కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. అలాగే సినీ నటులు కూడా సునీత, రామ్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే తన అభిమానుల కోసం సునీత తమ ఇద్దరు పిల్లలు, భర్త రామ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ.. మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సునీత ఫ్యామిలీ ఫొటోని షేర్ చేశారు. ఆ ఫొటో చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సునీత ఫ్యామిలీ చూడడానికి రెండు కళ్ళూ చాలటం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Share

Related posts

Junior NTR: భువనేశ్వరికి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య 12 గంటల దీక్ష..జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు..

somaraju sharma

Pushpa: దేశవ్యాప్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హవా చాటుతున్న పుష్ప..!!

sekhar

ఎమ్మెల్యేలే కాదు! టిడిపి ఎంపీలు కూడా రెడీ అయిపోతున్నారు!!

Yandamuri