Singer Sunitha : సింగర్ సునీత అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె పాట వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది. గత ఏడాది సునిత రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఆమె రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఒకవైపు రామ్ వీరపనేనికి సంబంధించిన పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే మరోవైపు సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా.. బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా.. జడ్జిగా కూడా ప్రేక్షకులను అలరిస్తూ తన కెరీర్ని పరుగులు పెట్టిస్తున్నారు.
Singer Sunitha : సింగర్ సునీత పోస్ట్ చేసిన వీడియో వైరల్..
ఆమె సంగీతానికి సంబంధించిన వీడియోలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల తన అరటితోటలో అరట గెల కోస్తున్న వీడియోని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అది కాస్త వైరల్ అయ్యింది. చక్కరకేళీ ఎంత తీయగా ఉంటుందో తెలుస.. మీ గొంతునుంది వెలువడే పాటంత. మీ ఆనందం ఇలాగే కలకాలం ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలంటూ ఈ వీడియో పై పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక మరోవైపు కూరగాయలు కోస్తూ కనిపించారు సునీత. ఈ వీడియోకి రెండు లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. సునీత పొలం పనులు చేస్తుంటే ఆమె పాటంత మాధుర్యంగా ఉందంటున్నారు నెటిజన్లు.
పొలంలో పనిచేయడం అంటే ఇష్టం..
పొలంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం.. తాజా కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టం అని సునీత చెప్పారు. ఫార్మింగ్, గార్డెనింగ్ పై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధని తన వీడియోల రూపంలో పంచుకుంటూ తెలియజేస్తుంది సునిత. ఎప్పుడూ పాటలు పాడుతూ కనిపించే సునీత ఒక్కసారిగా వ్యవసాయం వైపు వెళ్లడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.