Singer Sunitha: సింగర్ సునీత.. గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బేసిగ్గా సింగర్ అయిన సునీత డబ్బింగ్ లోను ఆరితేరింది. కొన్ని వందల సినిమాలలో హీరోయిన్స్ కి తన గొంతుని అప్పుగా ఇచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే సునీత అందంలోనూ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ అని చెప్పుకోవాలి. సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Budget 2022: కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన ..ఎవరేమన్నారంటే..
Singer Sunitha: సునీత వెడ్స్ రామ్ కహాని ఇదే..
పోయిన సంవత్సరం మొదట్లో మేంగో యూట్యూబ్ ఛానల్ అధినేత అయినటువంటి రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సునీత వ్యారంలోను అతనికి చేదోడువాదోడుగా ఉంటోంది. పెళ్ళి తరువాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సునీత మరోసారి సోషల్ మీడియాలో మాత్రం మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఫార్మింగ్ లో భాగంగా అనేక ఫోటోలను, వీడియోలను ఆమె తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు పొక్కింది.
Naga shaurya: హీరో నాగశౌర్యకు దెబ్బ మీద దెబ్బ.. `లక్ష్య` లాసెంతో తెలిస్తే మీరే పాపమంటారు!
సునీత కుమారుడు ఆకాష్ ఇక రెడీ అట!
విషయం ఏమంటే సునీత మొదటి భర్త కుమారుడు అయినటువంటి ఆకాష్ త్వరలో టాలీవుడ్లో లీడ్ రోల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడట. దానికి సంబంధించిన పనులన్నీ సునీత చాలా పక్కాగా ప్లాన్ చేస్తుందట. అవును.. సునీత కొడుకు ఆకాష్.. ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడని తేటతెల్లం అయిపోయింది. నేటితరం హీరోలకు ఇతగాడు ఎంతవరకు పోటీ ఇవ్వనున్నాడో మరి కొన్ని నెలలో తేలిపోనుంది. ఇకపోతే ఆకాష్ ని హీరోగా పరిచయం చెయ్యడానికి సునీత రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి.