Singer Sunitha: టాలీవుడ్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయినటువంటి సునీత గురించి చెప్పేదేముంది. ఈ మధ్యకాలంలో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని పెళ్లాడిన ఆమె, ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తోందనే చెప్పుకోవాలి. ఇక ఇది సునీతకు రెండో వివాహం అనే సంగతి మనందరికీ తెలుసు. మొదటి వివాహం తరువాత ఆమెకు ఓ కుమారుడు, కూతురు కలిగారు. ఆ ఇద్దరే దగ్గరుండి మరీ సునీతకు రెండో వివాహం జరిపించడం మనం చూసాం.
TSRTC: ‘బస్ డ్రైవర్ పై రైతు ఆరోపణలు అవాస్తవం..’ అసలు విషయం ఇదీ..!
Singer Sunitha: అదిరిపోయే కొత్త వార్త ఇదే…
ఇకపోతే సునీత కొడుకు ఆకాష్ ఇప్పుడు హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అవును.. త్వరలోనే ఆకాష్ హీరోగా పరిచయం అవ్వనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. సునీత కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం.
RRR: మార్చ్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్..కొత్త రిలీజ్ ఇదే
సోషల్ మీడియాలో సునీత అండ్ శారీ..
బేసిగ్గా సునీత ప్రకృతి ప్రేమికురాలు. తరచూ ఫోటోలు, వీడియోలతో తన అభిమానులకు అతి దగ్గరగా ఉంటుంది సునీత. దాంతో సునీత అంటే తన అభిమానులు ఎంతగానో ఇష్టపడుతూ వుంటారు. తాజాగా ఓ అందమైన బ్లూ కలర్ శారీలో తీసుకున్న ఓ పిక్ ని తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దాన్ని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నాలుగు పదుల వయసులోనూ మేడం సునీత ఏమాత్రం తగ్గలేదంటూ ఎత్తేస్తున్నారు.