Singer Sunitha :ప్రముఖ నేపథ్య గాయకురాలు సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని సునీత వివాహం చేసుకున్నారు.. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సునీత ట్వీటర్ లో తన భర్త తో కలిసి దిగిన ఫోటో పెట్టారు.. ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది..
జనవరి 9న వీరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వీరి పెళ్ళి కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ ఉండే సునీత. పెళ్లైన తరువాత తొలిసారి తన భర్తతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. అందులో రామ్ ని హత్తుకొని ఉన్నారు. ఈ ఫోటో ఆమె అభిమానులను బాగా ఆకర్షిస్తోంది.. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తునే, ఇటు సినిమాల్లో కూడా బిజీ అయిపోయారు.