ప్రముఖ గాయిని సునీత ఉపద్రష్ట కు రామ్ వీరపనేని కి ఇటీవల వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన విషయం తెల్సిందే. సునీత రెండవ పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవ్వడంతో అందరూ ఆమె వివాహ సుముహూర్త తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇరువురి కుటుంబ సభ్యులు సునీత మరియు రామ్ ల వివాహానికి సుముహూర్తంను ఖరారు చేశారు. దీనిని అధికారికంగా కూడా ప్రకటించారు.
తన జీవితం ఇలా ఉండకూడదు అని తన పిల్లలు ఒప్పించడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆమె తన నిశ్చితార్ధ ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసినప్పుడు రామ్ చాలా మంచివారని, తన మిగిలిన జీవితాన్ని ఆయనతో పంచుకోబోతున్నానని చాలా సంతోషంగా తెలియజేసారు.
అయితే, సునీత మరియు రామ్ల వివాహం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు బట్టి ఇరువురి జాతకాల ప్రకారం డిసెంబర్ 26న మంచి ముహూర్తం ఉండడంతో అదే ఖాయం చేశారట. ఆ తేదీనే వీరి వివాహం జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది జనవరి నుంచి మే నెల వరకు మంచి మూహూర్తాలు లేని నేపథ్యంలో డిసెంబర్ 26న రామ్ సునీతల వివాహం జరగనుందని సమాచారం. కరోనా నేపథ్యంలో పెళ్లిని కూడా చాలా సింపుల్ గా రెండు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల మద్యే జరిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారట. వీరి వివాహం ఈనెల 26 న ఒక ప్రైవేట్ వేడుక లాగా సింపుల్ గా జరగనున్నది.