NewsOrbit
న్యూస్

సంక్షేమం అనంతరం జగన్ స్టెప్ రెడీ!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… తాను ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ మొదటి ఏడాదంతా సంక్షేమంపైనే జగన్ పూర్తి దృష్టి కేంద్రీకరించారు! ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచీ… ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేదానిపైనే జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో నవరత్నాల పేరుతో అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు చేసుకోగలిగారు! ఈ కార్యక్రమాల్లో చిన్న చిన్న రాజకీయ విమర్శలు వచ్చినప్పటికీ.. సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ కు ఫుల్ మార్కులు పడినట్లే. ఆ సంగతి అలా ఉంచితే… సంక్షేమం ఒక్కటే కాదు కదా… ఆదాయం పెంచుకునే మార్గాలు మరింత ముఖ్యం కదా అనే కామెంట్లు బలంగా వినిపించాయి. వీటికి సమాధానాలు జగన్ ఎప్పుడో సిద్ధం చేసుకున్నారట!

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌య్యింది. ఈ ఏడాదిలో సంక్షేమ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బు పంప‌కాలు త‌ప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే ఏ ఒక్క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌లేద‌నే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. “ఏపీలో రూ.18 వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో తొమ్మిది భారీ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కానున్నాయి.. శుక్ర‌వారం నిర్వ‌హించే రాష్ట్ర‌స్థాయి పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క బోర్డు (ఎస్ఐపీబీ) స‌మావేశంలో ప్ర‌భుత్వం వాటికి ఆమోదం తెల‌ప‌నుంది.. వాటికిచ్చే ప్రోత్సాహ‌కాల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చైర్మ‌న్‌ గా నిర్వ‌హించిన రాష్ట్ర‌స్థాయి పెట్టుబ‌డుల క‌మిటీ (ఎస్ఐపీసీ)లో అధికారులు చ‌ర్చించారు.. వీటితో పాటు శ్రీ‌సిటీలో జ‌పాన్‌ కు చెందిన ప‌ది ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కానున్నాయి.. వాటి ద్వారా మ‌రో రూ.6 వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి..” అనేది ఆ వార్త సారాంశం! దీంతో ఆదాయం పెంచుకునే విషయంలో జగన్ తన ప్లాన్స్ తనకు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదే క్రమంలో జగన్ పై మరో విమర్శ… ఉద్యోగాలు లేవని! ఇప్పటికే గ్రామసచివాలయాలు, గ్రామ వాలంటీర్ల పేరుతో లక్షల ఉద్యోగాలు కల్పించమని ఏపీ సర్కార్ చెప్పుకుంటుంది. ఇదే క్రమంలో కొత్తగా రాబోయే.. అల‌య‌న్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)న‌కు చెందిన ఏటీసీ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, షాన్ షూ కేసింగ్ , ట్రీన్ టెక్‌, గ్రీన్ ఫ్లై, చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేష‌న్ (సీఆర్ఆర్‌సీ), శ్రీ‌కాళ‌హ‌స్తి పైప్స్‌, గ్రాసిమ్ ఇండ‌స్ట్రీస్ వంటి భారీ ప‌రిశ్ర‌మ‌ల‌తో స్థానికంగా ఉద్యోగాలు అధికంగా వచ్చే అవకాశాలున్నాయి.

ఇప్పటికే “స్థానికులకే ఉద్యోగాలు” అనే విషయంలో జగన్ సర్కార్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో… ఈ ప‌రిశ్ర‌మ‌ల‌ ఏర్పాటుతో అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా మార్గం సుగమం అయినట్లే!! దీంతో… సంక్షేమం విషయంలోనే కాదు… అభివృద్ధి, ఉద్యోగాల విషయంలో కూడా జగన్ సీరియస్ గా ప్లాన్స్ చేసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!