Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ వారం హౌస్ లో మిగిలి ఉన్న కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులను.. హౌస్ లో కి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్ లో ఉన్నారు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లోకి కాజల్(Kajal) కుటుంబానికి చెందిన భర్త ఆమె కూతురు ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో కాజల్ భర్త అందరిని మెచ్చుకుంటూ కాజల్ ఇంకా స్ట్రాంగ్ గా గేమ్ ఆడాలని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ రామచంద్ర(Sri Ram) సిస్టర్ ఎంట్రీ ఇచ్చి.. శ్రీరామ్(Sri am) ఇంకా స్ట్రాంగ్ గా ఆడాలని.. నామినేషన్ సమయంలో చెప్పే పాయింట్ల విషయంలో క్లారిటీ ఉండాలని సూచించింది. హౌస్ లో అందరితో ఫస్ట్ రెండు ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వాళ్ళు బాగా మాట్లాడారు.
ఆ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మానస్(Manas) వల్ల అమ్మ ఫుల్ ఎనర్జీ తో …సందడి సందడిగా ఇంటి సభ్యులను జోష్ తో నింపారు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన సిరి వాళ్ళ అమ్మ.. హౌస్ లో అందరితో బానే మాట్లాడిన గాని షణ్ముఖ్ విషయంలో ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. మేటర్ లోకి వెళ్తే షణ్ముక్(Shanmuk).. సిరికి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. ఒక తండ్రి లాగా ఒక అన్న లాగా.. అంటూ ఆమె కామెంట్ చేయటం మాత్రమే కాక సిరికి ప్రతిసారి హగ్ ఇవ్వటం తనకు నచ్చలేదని ఇంటి సభ్యులందరినీ ముందు.. ఆమె డైలాగులు వేయటం గురువారం ఎపిసోడ్ లో సంచలనంగా మారింది.
సిరి వాళ్ళ అమ్మ వేసిన డైలాగులకు .. షణ్ముఖ్ చాలా బాధపడ్డాడు. చాలాసార్లు సిరి కి గేమ్ లో భాగంగా షణ్ముక్ బాగా హగ్ లు ఇస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున(Nagarjuna).. షణ్ముఖ్.. సిరి నీ.. కన్ఫెక్షన్ రూమ్ లోకి పిలిచి హెచ్చరించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఫ్యామిలీ ఎపిసోడ్ లో.. ఏకంగా శిరి వాళ్ళ అమ్మ షణ్ముక్ కి వార్నింగ్ ఇచ్చినట్లు అందరి ముందు మాట్లాడటం తో షణ్ముక్ పరుగు పోయినట్లు అయిందని గురువారం ఎపిసోడ్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన పై బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్లూ చేస్తున్నారు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?