Deepthi Sunaina-shanmukh: అవును.. మీరు వింటుంది నిజమే. షణ్ముఖ్‌కి దీప్తి సునయన తాజాగా కటీఫ్ చెప్పింది. కొన్ని సైట్వ్క్తగత కారణాలతో తమ ప్రేమకి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు దీప్తి తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ రాసుకొచ్చారు. “ఎంతో ఆలోచించి మేము ఇద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మా దారులు పూర్తిగా వేరని మాకు అర్థమైంది. ఇలాంటి కష్టసమయంలో మాకు మీ అండ ఎంతో అవసరం. దయచేసి మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరని మేము వేడుకుంటున్నాం.” అనేది ఆ పోస్ట్ సారాంశం. బ్రేకప్ ప్రకటించిన అనంతరం ఆమె తన ఇన్‌స్టాలో కామెంట్ సెక్షన్‌ని ఆఫ్ చేయడం కొసమెరుపు.
CM YS Jagan: సినిమా టికెట్ల అంశంపై తొలి సారి స్పందించిన సీఎం జగన్..! ఏమన్నారంటే..?
షణ్ముఖ్ – దీప్తి సునయన కటీఫ్ కి సిరి కారణమా?
అవుననే కొందరు గుసగుసలు ఆడుకుంటున్నారు. ముఖ్యంగా షణ్ముఖ్ అభిమానులు మాత్రం దీనికంతటికీ కారణం కేవలం సిరినే అని సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే విషయం తెలిసిన సిరి మాత్రం దానికి కారణం తను ఎంతమాత్రమూ కాదని, షణ్ముఖ్ తనకు ఓ మంచి ఫ్రెండ్ అని.. తన సహచరుల దగ్గర వాపోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోషల్ మీడియా స్టార్స్ అయినటువంటి వీరిద్దరూ గతంలో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మనం చూసాం. పలు షార్ట్ వీడియోలు కూడా వీరు చేసారు. అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకొనేసరికి దీప్తి ఇలా షాక్ ఇవ్వడం కొంతమంది షణ్ముఖ్ అభిమానులకు మింగుడు పడటంలేదు.
Cloves: పరగడుపున రెండు లవంగాలు తింటే మనం ఊహించని ప్రయోజనాలు..!!
సిరి – షణ్ముఖ్ రిలేషన్ ఎక్కడకి దారితీస్తోంది?
ఏది ఏమైనా ఈ బ్రేకప్ కి కారణం కేవలం సిరే అన్నది కొందరి వాదన. అయితే ఇంతవరకు షణ్ముఖ్ గాని, సిరి గాని “మేము రిలేషన్ లో వున్నాం!” అనే మాట ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు దీనికి కారణం సిరే అని మీరెలా అంటారు? అనే ప్రశ్నలు సిరి అభిమానులు వేస్తున్నారు. యూట్యూబ్, డబ్స్మాష్ వీడియోల కోసం దీప్తి షణ్ముఖ్ మొదటిసారి కలవడం మనకు తెలిసినదే. వ్యక్తిగతంగా ఇద్దరికీ డ్యాన్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఎన్నో కవర్ సాంగ్స్ చేసి వున్నారు. దీంతో ఈజంటకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?