24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
న్యూస్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన దివంగత దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల కుటుంబ సభ్యులు..ఎందుకంటే..?

Share

దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులు ఇవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ ను సీతారామ శాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యలు కలిసి దుశ్సాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ఆర్ తో సిరివెన్నెల కు ఉన్న అనుబంధాన్ని సీఎం జగన్ తో పంచుకున్నారు.

Sirivennela family meets AP CM Ys Jagan

 

సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడంతో పాటు సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై వారు సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. సీఎంని కలిసిన వారిలో సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి ఉన్నారు.

బీఆర్ఎస్ కు షాక్ .. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి రాజీనామా


Share

Related posts

ఖైరతాబాద్ గణేశ్‎ని చూడటానికి ఎవరూ రావొద్దు…!!

sekhar

Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?

somaraju sharma

కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌న్నాడు….టీఆర్ఎస్ నేత‌పై ఫైర‌య్యాడు…దానం లెక్కే వేరు

sridhar