Nani: ‘శ్యామ్ సింగ రాయ్’ లో ‘సిరివెన్నెల’ చివరి పాట..ఇది నానికి మాత్రమే దక్కిన అదృష్టం..అవును.. ఈ అదృష్టం కేవలం నానికి మాత్రమే దక్కింది. ఈ పాట నాని జీవితం మొత్తం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలింది. అంత స్పెషాలిటీ ఉంది ఈ పాటకు. లెజండరీ సింగర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కెరీర్‌లో ఆయన రాసిన చివరి పాట ‘శ్యామ్ సింగ రాయ్’ లో రాయడం విశేషం. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ కలకత్తా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. నానికి చాలాకాలం అయింది ఓ భారీ హిట్ వచ్చి.

మళ్ళి ఓ పెద్ద కమర్షియల్ హిట్ ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో రాబోతుందని అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. హిట్ విషయం పక్కనపెడితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లాంటి ఏ అగ్ర హీరోకు దక్కని అవకాశం నాని దక్కించుకున్నాడు. అదే లెజండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో రెండు పాటలు రాశారు. అందులో ఆయన పేరుతో రాసిన ఈ చివరి పాటను థర్డ్ సింగిల్‌గా డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
Nani: సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటతో ఎన్ని కోట్ల కళ్ళు చమర్చుతాయో..!
అంతేకాదు తాజాగా దీనికి సంబంధించిన అనుభవాలను హీరో నాని, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఓ వీడియో టీజర్ ద్వారా పంచుకున్నారు. దాంతో అందరూ డిసెంబర్ 7 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటతో ఎంతమంది గుండెలు బరువెక్కుతాయో ఎన్ని కోట్ల కళ్ళు చమర్చుతాయో. కాగా, సాయి పల్లవి..కృతిశెట్టి..మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించాడు. నానీ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమ కావడం కూడా విశేషం.