Sirivennela Sitaramasastri: మరణాన్ని ముందే ఊహించిన సిరివెన్నెల

Share

Sirivennela Sitaramasastri: సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినీ ప్రపంచంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తిపు సాధించుకున్న వ్యక్తి. అంతటి ఘనకీర్తిని కలిగిన వ్యక్తి హఠాత్తుగా న్యూమోనియాతో బాధపడుతూ సడెన్ గా మనల్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతడి మరణం పట్ల చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆయనకు సంతాపం ప్రకటించాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతినిధులుగా మంత్రులు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

 

Sirivennela Sitaramasastri: శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ తో

ఇప్పుడు సిరివెన్నెలకు సంబంధించిన ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఆయన మరణాన్ని ముందే ఊహించినట్లుగా పలువురు చెబుతున్నారు. నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ అనే సినిమా డైరెక్టర్ రాహుల్ సంకీర్త్యన్ తో సిరి వెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ.. ఇదే నా చివరి సినిమా అవుతుంది కావచ్చునని చెప్పారని ఆ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన వీడియోలో తెలిపింది. సిరివెన్నెల ఎంతో గ్రేట్ అని కూడా ఆ మూవీ యూనిట్ పేర్కొంది. సిరివెన్నెల నాని సినిమా శ్యామ్ సింగరాయ్ కి రెండు పాటలు రాశారు. ఇక ఆ సినిమాలో సిరి వెన్నెల రాసిన పాటకు సిరివెన్నెల అనే పేరునే చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

 

తమ సినిమాను సిరివెన్నెలకు అంకితం చేసిన నాని..

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి తన జీవితంలో దాదాపు 3000 పై చిలుకు పాటలు రాశారు. అందులో ఎన్నో మధురమైన సాంగ్స్ ఉన్నాయి. కేవలం రొమాంటిక్ సాంగ్స్ మాత్రమే కాకుండా సమాజాన్ని నిద్ర లేపే ఎన్నో పాటలను సిరివెన్నెల రాయడం గమనార్హం. తమ శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరి వెన్నెలకు అంకితం ఇస్తున్నట్లు నాచురల్ స్టార్ నాని ప్రకటించారు. శ్యామ్ సింగరాయ్ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.


Share

Related posts

పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలంటే టైం పడుతుంది అంటున్న ఏపీ మంత్రి..!!

sekhar

Naga chaithanya : నాగ చైతన్య రూటు మారిస్తే సక్సస్ లకి బ్రేక్ పడుతుందేమో ..?

GRK

చ‌రిత్ర మ‌ర‌చిపోని `జార్జ్‌రెడ్డి`

Siva Prasad