21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ మరో కీలక అడుగు.. బీజేపీ కీలక నేతపై కేసు నమోదు

Share

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు చేస్తున్న సీట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో విచారణకు హజరు కాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసు నమోదు చేశారు. బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయవద్దన్న ఆర్డర్ ను రద్దు చేయాలని సిట్ తరపున ప్రభుత్వ న్యాయవాది నిన్న హైకోర్టులో విజ్ఞప్తి చేయగా, అందుకు ధర్మాసనం నిరాకరించింది. మరో సారి నోటీసులు జారీ చేయాలని, ఇమెయిల్, వాట్సాప్ ద్వారా 41ఏ సీఆర్పీసీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పరిణామ క్రమంలో సంతోష్ తో పాటు మిగిలిన ఇద్దరికిపై సిట్ కేసు నమోదు చేసింది.

TRS MLAs poaching case

 

మరో వైపు హైకోర్టు ఆదేశాల మేరకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను సంతోష్ కు పంపారు సిట్ అధికారులు. తమ విచారణకు హజరు కావాలంటూ ఆయనకు రెండు తేదీలను నోటీసులో సూచించారు. ఈ నెల 26 లేదా 28వ తేదీన విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.  ఇదే కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ కు ఈ నెల 25వ తేదీన హజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ నందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు జరిపారన్న అభియోగంపై రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేయగా, సిట్ అధికారులు వేగంగా దర్యాప్తును జరుపుతున్నారు.  ఈ కేసు అంశంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం జరిగింది.

ఐటీ దాడుల్లో బిగ్ ట్విస్ట్ .. మంత్రి మల్లారెడ్డి Vs ఐటీ .. కేసు, కౌంటర్ కేసులు నమోదు


Share

Related posts

‘మీ ప్రతాపం వీరిపై కాదు కేంద్రంపై చూపండి!’

somaraju sharma

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే ప్రాజెక్ట్ మీద క్లారిటీ వచ్చేసింది..?

GRK

TRS: ‘సాగర్’ ఫలితంపై గులాబీ నేతల గుబులు!గెలుపు పై దిగులు!

Yandamuri