NewOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యూ ట్విస్ట్..సిట్ కీలక అడుగు

Share

TRS MLAs poaching case: టీఅర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యూ ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు సిట్ అధికారులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో నిందితుల తెరవెనుక ఉన్నారని భావిస్తున్న కేరళకు చెందిన డాక్టర్ కే నారాయనణ్ జగ్గు అలియాస్ జగ్గు స్వామి పరారీలో ఉండటంతో సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పోయారు.

TRS MLAs poaching case

దీంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరో పక్క ఈ కేసులో విచారణకు గానూ ఈ నెల 21వ తేదీ బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ నేత తుషార్, న్యాయవాది శ్రీనివాస్ సిట్ అధికారుల ముందు హజరు కావాల్సి ఉండగా, న్యాయవాది శ్రీనివాస్ మాత్రం హజరైయ్యారు. బీఎల్ సంతోష్, తుషార్ హజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సిట్ ..వీరిపై లుక్ అవుట్ సర్క్యులర్ ను జారీ చేసింది. న్యాయవాది శ్రీనివాస్ ఈ రోజు మరో మారు సిట్ విచారణకు హజరైయ్యారు. సిట్ అధికారుల విస్తృత దర్యాప్తులో ఆరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలునకు ప్రయత్నాలు జరిగినట్లుగా గుర్తించారు.

Advertisements

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీ ఆర్ఎస్ ఎమ్మెల్యేల తో బేరసారాలు జరుపుతున్న క్రమంలో రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి బిగ్ షాక్.. కుమారుడు, అల్లుడు నివాసాల్లో ఐడీ రైడ్స్..


Share

Related posts

Blood Pressure: ఇది ఒక్కటి తింటే రక్తపోటు జన్మలో రాదట.! డాక్టర్లే చెబుతున్నారు..!!

bharani jella

CM YS Jagan: పేద బ్రాహ్మణ యువత అభ్యున్నతి కోసం జగన్ సర్కార్ మరో కొత్త పథకం..కార్పోరేషన్ ద్వారా

somaraju sharma

ఈనాడు..? ఎవరిపై పిడుగు..??

Muraliak