NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ కీలక నేతకు నోటీసులు

TRS MLAs poaching case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన కీలక నేతకు సీట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన తుషార్ వెళ్లప్పల్లికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 21వ తేదీలోపు విచారణకు హజరు కావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. తుషార్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని వాయినాడ్ లో రాహుల్ గాంధీ పై ఎన్డీఏ అభ్యర్ధి గా పోటీ చేసి ఓడి పోయారు. బీజేపీ అగ్రనేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయనే వాదన ఉంది. ఎమ్మెల్యే ల కొనుగోలు బేరసారాలు నిర్వహించిన కేసులో నిందితుడుగా ఉన్న రామచంద్రభారతితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో తుషార్ ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కేరళకు చెందిన మరో స్వామిజీ జుగ్గూజి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను విచారించిన అధికారులు ఎపి, హర్యానా, కేరళ, కర్ణాటక తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని నందకుమార్ కు చెందిన హోటల్, నివాసాలలో సోదాలు జరగ్గా, తిరుపతిలోని సింహయాజీ ఆశ్రమంలో , అలాగే హర్యానా, కర్ణాటక లో రామచంద్ర భారతి నివాసాల్లో, అలాగే కేరళ రాష్ట్రంలోని ఓ వైద్యుడి నివాసంలో సోదాలు జరిపినట్లు తెలుస్తొంది. ఈ కేసులో కేరళలోని వైద్యుడు కూడా మద్యవర్తిత్వం చేశాడని సమాచారం. అందులో భాగంగానే సిట్ సోదాలు జరిపింది. బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షిస్తుందని చెప్పింది.

thushar vellappally

author avatar
sharma somaraju Content Editor

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju