NewsOrbit
న్యూస్

TDP : తప్పులు కనిపించవా? ఏమిటి నాటకం??

TDP : విగ్రహాల ధ్వంసం కేసులో కీలకమైన దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ  sit సీట్ బృందానికి ఓ కీలకమైన ఆధారం లభించింది. ఆధారము కన్నా ఓ ఆలయం విగ్రహం ధ్వంసం కేసులో వారు చేసిన విచారణలో టిడిపి నేతలు బయటకు వచ్చారు. రాజమండ్రి నగరంలోని శ్రీరామ్ నగర్ లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇటీవల విగ్రహం ధ్వంసం జరిగిన విషయాన్ని పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసిన సిట్ బృందానికి… ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆలయ పూజారి, ఆలయ ధర్మకర్త గా ఉన్న టిడిపి నాయకుడు అని తెలిసింది.. సదరు టిడిపి నాయకుడు గన్ని కృష్ణ రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి గా సైతం కొనసాగుతున్నారు. పూజారి తో పాటు ఆలయ ధర్మకర్త మరో ఇద్దరిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఓ పద్ధతి ప్రకారమే రాష్ట్రంలో వరుస హిందూ ఆలయాలపై దాడులు ఘటన నేపథ్యంలో దాన్ని కొనసాగించే ఈ విషయంలో కొందరితో ఆలయంలోని విగ్రహాన్ని కావాలనే ధర్మకర్త చేయించారనేది చిన్న విషయం కాదు. దీనిలో అరెస్టులు పూర్తయినప్పటికీ కనీసం ఈ విషయం బయట పడకుండా మాత్రం మీడియా లో రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో టిడిపి విజయవంతమైంది.

sit no-mistakes-show-for-tdp
sit no-mistakes-show-for-tdp

TDP : ఎందుకీ దారుణాలు!!

హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని నిలువరించ లేకపోయింది అనే అపప్రద మోట కొట్టుకోవడం తో పాటు… హిందూ మతాన్ని ఆచరించే వారి మనోభావాలను ఈ అంశాలు గాయపరిచాయి. దీనిని ఖచ్చితంగా కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠకు భంగం కలిగించేలా టిడిపి నాయకులు రాజమండ్రి ఘటనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహానికి అవమానం జరిగేలా ధ్వంసం చేశారు. కొంతమంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మరి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది సిట్ దర్యాప్తులో తేలింది. అంటే రాష్ట్రంలో వరుసగా జరిగిన ఆలయ దాడుల వెనుక సైతం టిడిపి నేతలు ఉన్నారా అన్న అనుమానం కలుగుతుంది. విపక్షం గా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన టిడిపి ఇలా ఆలయాలను సొంతంగా ధ్వంసం చేసేందుకు వ్యూహరచన చేయడం డబ్బులిచ్చి మరీ విగ్రహాలను నాశనం చేయడం చిన్న వార్త ఏమీ కాదు. అయితే ఇది ఎక్కడ ఏ మీడియాలో సైతం ప్రముఖంగా కనిపించలేదు. సాక్షాత్తు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ ఈ కేసును మీడియా పట్టించుకోకపోవడం వెనక ఉన్న కుట్ర అర్థం అవుతుంది.

sit no-mistakes-show-for-tdp
sit no mistakes show for tdp

వైస్సార్సీపీ నాయకులు ఐతే..!!

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకో మీడియా అన్నట్లు, పరిస్థితి ఉంది. ముఖ్యంగా టిడిపి అనుకూల మీడియా ఆధిపత్యంలోనే కొనసాగుతోంది. అధికార పార్టీ వైఎస్ఆర్సిపి కు సొంత పత్రిక సొంత ఛానల్ ఉన్నప్పటికీ దానిని నమ్మే పరిస్థితి పూర్తిగా లేదు. దీంతోపాటు వైయస్సార్సీపి సోషల్ మీడియా విభాగం ఉన్నప్పటికీ వారు వేసే పోస్టులు… చేసే వ్యాఖ్యల పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో టీడీపీ అనుకూల మీడియా ఓ పద్ధతి ప్రకారం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. విగ్రహాల ధ్వంసం కేసులో వైఎస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా నీ… వారు దీనిలో ఓ భాగం అయినట్లు గానీ ఏ మాత్రం తెలిసినా ఈ విషయం రాష్ట్ర వ్యాప్తం అయ్యేది. రకరకాల చర్చలు రకరకాల డిబేట్లు ద్వారా రకరకాల ప్రజాభిప్రాయసేకరణ అంటూ నానా రకాల యాగీ చేసి అధికార పార్టీపై తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారానికి దిగేది. అయితే ఈ కేసులో పూర్తిగా టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు సిట్ పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఈ కేసు మరుగున పడిపోయింది.

 

మరింత లోతు అవసరం!

విగ్రహాల ధ్వంసం వెనక టిడిపి నాయకులు కేవలం రాజమండ్రి ఘటన లోనే ఉన్నారు అని చెప్పడానికి లేదు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా జరిగాయి. సుమారు 36 కేసులను పోలీసులు గుర్తించారు. మరి ఇతర కేసుల్లోనూ ఏమైనా విపక్ష నాయకుల హస్తం ఉందా అనేది పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. కావాలనే విపక్ష నాయకులు దీనిలో నాటకం ఆడుతున్నారా లేక రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి శాంతిభద్రతలు సమస్య తీసుకొచ్చేందుకు ఓ రకమైన కుట్రపన్నారు అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. సిట్ ఒక్కో ఆలయ ధ్వంసం వెనుక ఉన్న కథలను బయటకు తీసుకు వస్తే గానీ అసలు దొంగలు ఎవరు… ఎందుకు ఈ నాటకం ఆడించారు అన్నది పూర్తిగా బయటకు వస్తుంది.

 

 

author avatar
Comrade CHE

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju