సీతా రామం గురించి వెలుగులోకి వచ్చిన సంచలన నిజం.. హీరోయిన్ చెప్పిందంతా అబద్ధమేనా?

Share

హను రాఘవపూడి తెరకెక్కించిన సీతా రామం ఒక ఎపిక్ లవ్ స్టోరీ అని, మనస్సులను హత్తుకునేలా ఉందని అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాకి హిట్ రావడం దాదాపు ఖాయమైంది! ఈ సినిమాలో రాముడు, సీత పాత్రలలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ చూపించిన నటనాభినయానికి సినీ ప్రేమికులు మంత్రముగ్దులవుతున్నారు. అయితే దుల్కర్ కంటే సీత రోల్ చేసిన మృణాల్‌కే ఎక్కువగా పేరు వచ్చింది. ఎందుకంటే ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. అయితే ఈ పాత్ర గురించి ఒక సంచలన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో సీత పాత్ర మృణాల్ కంటే ముందుగా వేరే హీరోయిన్‌కు దక్కింది. కానీ ఆమె ఈ గోల్డెన్ ఆఫర్‌ను వదులుకొని ఇపుడు బాధపడుతోంది.

సీతా రామంతో మృణాల్‌కి ఫుల్ క్రేజ్

మృణాల్ ఠాకూర్ సీతా రామం సినిమాతో సీతగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ తన లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో సినీ ప్రియుల హృదయాలను అమాంతం దోచేసింది. ఈ ముద్దుగుమ్మ ఈ పాత్ర కోసం తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. అలా ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే డైరెక్టర్ సీత పాత్ర కోసం మొదటగా తననే ఎంపిక చేసుకున్నారని ఈ ముద్దుగుమ్మ చెప్పింది కానీ అది నిజం కాదని తేలింది. సీత పాత్రకు మృణాల్ తొలి ఎంపిక కాదనే విషయం బయటకు వచ్చింది.

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న పూజా హెగ్డే

సీతగా పూజా హెగ్డేని నటింపజేయాలని హను రాఘవపూడి మొట్టమొదటిగా ప్లాన్ చేసాడు. ఈ సినిమా కథ విని ఫిదా అయిన పూజా నెల రోజుల పాటు డేట్స్ కూడా ఇచ్చింది. అయితే, సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటుండగా పూజా హెగ్డేకి కరోనా సోకింది. దీంతో ఆమె చాలా బక్కగా తయారయింది. సీత పాత్రకు ఆమె సెట్ కాదని హను రాఘవపూడి చాలా నిరాశ పడ్డాడు. ఆమె లావు అయ్యే లోపు సమయం పడుతుందని కూడా కలత చెందాడు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను వేరే హీరోయిన్ తో పూర్తి చేయాలనుకున్నాడు. అప్పుడే మృణాల్ ఠాకూర్‌ను ఆశ్రయించాడు. ఈ ముద్దుగుమ్మ ఈ కథ విని తనకు ఓకే అని చెప్పడంతో సినిమా మొదలు పెట్టేసాడు దర్శకుడు. అయితే కరోనా వల్ల పూజా హెగ్డే ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోయి ఇప్పుడు చింతిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించినట్లయితే సినిమా రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది. అలాగే ఆమెకు ఒక మంచి హిట్ వచ్చేది. కానీ ఆమెకు ఆ అదృష్టం దక్కలేదు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

40 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago