స్కూల్ బస్సు బోల్తా – ఆరుగురు చిన్నారులు మృతి

Share

సిర్మౌర్‌, జనవరి 5: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సిర్మౌర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు విద్యార్థులు మృతి చెందారని అక్కడి పోలీస్ వర్గాలు తెలిపాయి.

పలువురు విద్యార్థులకు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ లలిత్‌ జైన్‌ తెలిపారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో  వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Share

Related posts

తెలుగు బైబిల్ గురించి మీకు తెలియని నిజాలు!! తప్పకుండా తెలుసుకోండి…

Naina

మహేష్ బాబు కి ఈ హీరోయిన్ తెగ నచ్చేసిందట ..!

GRK

Niharika Konidela Engagement Photos

Gallery Desk

Leave a Comment