రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి

బలర్షా, జనవరి 16: మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు దుర్మరణం పాలైయ్యారు. గడ్చిరోలి జిల్లాలోని ఆహేరి డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు ఈటపల్లి తాలూకా గురుపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రెండు వాహనాలు బలంగా ఢీకొట్టుకోవడంతో ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడిన వారిని ఈటపల్లిలోని ఆస్పత్రికి తరలించారు.