ఆరవ శ్వేతపత్రం విడుదల

అమరావతి  డిసెంబర్ 28: మానవవనరుల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు శుక్రవారం ఆరవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం  మాట్లాడుతూ మానవవనరుల విలువను తెలియజేసి అందుకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మానవవనరులు సద్వినియోగం చేసుకుంటే సమాజానికి ఎంతో శ్రేయస్కరమని సిఎం  అన్నారు. గతంలో హైదరాబాద్‌కు ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు తీసుకురావడం వల్లే అభివృద్ధి చెందిందని గుర్తచేశారు. విభజన తర్వాత ఏపీలో విద్యాసంస్థలు లేని లోటు ఉందని, అందుకే నాలుగున్నర ఏళ్లలో విద్యాభివృద్ధిపై దృష్టిపెట్టామని తెలిపారు.

 

నాలెడ్జ్‌ మిషన్‌తో విద్యాసంస్థల్లో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. కొత్తగా యోగా, కూచిపూడి క్లాసులు ఏర్పాటు చేశామని తెలిపారు. నరేగా నిధులతో స్కూళ్లకు ప్రహరీగోడలు నిర్మించామని సీఎం వెల్లడించారు. అన్ని కాలేజీలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించామన్నారు. రాష్ట్రానికి ప్రైవేట్‌యూనివర్సిటీలు తీసుకొచ్చామని, ప్రైవేట్‌ యూనివర్సిటీలతో 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టించమన్నారు. విదేశీ సంస్థల ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో యువతకు శిక్షణ అందజేశామని చంద్రబాబు పేర్కొన్నారు.