SLEEPING: కంటి నిండా నిద్ర లేకపోతే ఆరోగ్యంతో పాటు అందం కూడా దెబ్బతింటుంది. అలాగే చాలామంది సమయపాలన పాటించకుండా ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఆహారాన్ని తినడం వల్ల కూడా వారికి సరైన నిద్ర అనేది ఉండదు అనే విషయం మీలో చాలా మందికి తెలియదు. సరైన నిద్రకరువైతే.. ఆ తరువాత రోజు అలసిపోయినట్లుగా ముఖం వాడిపోయినట్లు ఉంటుంది. అలాగే ఒక్కోసారి అధిక ఒత్తిడి కారణం చేత కూడా నిద్ర సరిగా పోలేరు. ఈ క్రమంలోనే కొంతమంది నిద్ర మాత్రలకు అలవాటు పడిపోతున్నారు. అలా మందులు వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా డాక్టర్ ను సంప్రదించకుండా నిద్ర మాత్రలు వేసుకోవడం సరైన పద్ధతి కాదు.
Masala Tea: మసాలా టీ టెస్ట్ చేశారా..!! ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే..!!
టాబ్లెట్స్ లేకుండా మీకు మంచి నిద్ర రావాలంటే మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే చాలు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దామా. ముందుగా మీరు చేయవలిసిన ముఖ్యమైన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న గాడ్జెట్లను ముందుగా స్విచ్ ఆఫ్ చేసేయండి. అలాగే చాలామంది ఫోన్ కి ఇచ్చే సమయాన్ని నిద్ర పోవడానికి కేటాయించడం లేదు. ఫలితంగా కంటిచూపు దెబ్బతింటుంది. అందుకనే మీరు నిద్రకి ఉపక్రమించే ముందు అన్ని గాడ్జెట్స్ ను ఆఫ్ చేసుకోవడమో లేక సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడమే చేయండి. ఇలా చేయడం వల్ల మీ నిద్రకు ఎటువంటి భంగం వాటిల్లదు. అలాగే మీరు ఇంకొక మంచి అలవాటును అలవర్చుకోవాలి.
Viral: ఆ ప్రాంతంలో కేజి ఆలు 3వేల రూపాలు.. ఎందుకంటే..?
అది ఏంటంటే పుస్తక పఠనం. పుస్తకాలు ఎక్కువగా చదవితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అందుకే నిద్రించే ముందు ఏదైనా మంచి పుస్తకాన్ని చదవి పడుకోండి. అలాగే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. పొద్దున నుంచి ఏదో ఒక పని చేసి అలిసిపోయి ఉంటారు కావున నిద్ర పోయే ముందు స్నానం చేస్తే సుఖంగా నిద్ర పడుతుంది. అలాగే పడుకునే ముందు శ్వాస వ్యాయామాలు అంటే ప్రాణాయామం చేస్తే కూడా మంచి నిద్ర పడుతుంది.
Bheemla Nayak: ధర్మేంద్ర అంటూ దద్దరిల్లిపోయే డైలాగులతో వచ్చేసిన డానియల్ శేఖర్..!