SLEEPING: నిద్ర అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. కంటికి సరిపడా నిద్ర లేనిదే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో చాలా మంది రాత్రి పూట పడుకున్నాగాని సరిగా నిద్ర పట్టకపోవడం, ఏవేవో ఆలోచనలు నిద్రలేమి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు మేము చెప్పే ఈ హోమ్ రెమిడీస్ పాటిస్తే హాయిగా నిద్రపోతారు. అవేంటంటే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా గోరు వెచ్చగా చేసి ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే తప్పకుండా నిద్ర పడుతుంది. అలాగే మీ ఇంట్లో గసగసాలు ఉంటే వాటిని కొద్దిగా దోరగా వేయించి ఒక పల్చని గుడ్డలో వేసుకుని మూటకట్టి రాత్రి పూట వాసన పీలుస్తూ ఉండాలి. గసగసాల వాసన పీల్చడం వలన హాయిగా నిద్రపోవచ్చు.
Allu Arjun: అల్లు అర్జున్ కోసం ఇద్దరు హీరోయిన్లను సెట్ చేస్తున్నా డైరెక్టర్..??
అలాగే నిద్ర పట్టని వారు తలకు నూనె రాసుకుని చేతివేళ్లతో మాడును మర్దన చేసుకుంటే నిద్ర పడుతుంది. అలాగే పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం, నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా సరే మంచిగా నిద్ర పడుతుంది. ఇవన్నీ కుదరని వాళ్ళు ఎంచక్కా రాత్రి పూట పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పౌడర్ కలుపుకుని తాగినా సరే నిద్ర పడుతుంది. అలాగే అందరు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే రాత్రిపూట ఎక్కువగా ఫోన్ చూడడం అన్నమాట.
Sun Tan: 5 నిమిషాల్లో సన్ టాన్ ను తొలగించుకోండి..!!
అసలు నిద్ర పోవడానికి రెండు గంటల ముందు ముందు మొబైల్ ఫోన్ చూడటం మానేస్తే చాలా మంచిది.కొంతమంది ఫోన్ పడుకునే ముందు పక్కనే పెట్టుకుని మరి పడుకుంటారు.అలా ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావంతో కూడా సరిగ్గా నిద్ర పట్టదు. అలాగే పడుకునే ముందు ఒక పావుగంట పాటు అయిన ఏదన్నా ప్రశాంతమైన సంగీతం వినటం లాంటివి అలవాటు చేసుకోండి.అలాగే కళ్ళు మూసుకుని కొద్ది సేపు మనసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటే నిద్ర బాగా పడుతుంది. నిద్ర పట్టడం లేదు కదా అని నిద్ర మాత్రలు అలవాటు చేసుకోవడం మాత్రం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అనే విషయం గుర్తుపెట్టుకోండి..!
BREAKING: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నో చెప్పిన ఏపీ ప్రభుత్వం..!