NewsOrbit
న్యూస్

రాపాక వరప్రసాద్ తో పవన్ కళ్యాణ్ కు నిద్ర లేని రాత్రులు !

151 మంది ఎమ్మెల్యేలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా వేగుతున్నాడో ఏమో గాని ఒకే ఒక్క ఎమ్మెల్యే తో జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు.

Pawan Kalyan writes to Rapaka Varaprasad Rao, instructs him to ...
Pawan Kalyan writes to Rapaka Varaprasad Rao, instructs him to …

 

పవన్‌ కళ్యాణ్‌, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, రాజోలు లో రాపాక వరప్రసాద్‌ మాత్రం అనూహ్యంగా గెలిచారు. ‘మా పార్టీ నుంచి గెలిచింది ఒక్కరే అయినా.. అసెంబ్లీలో అధికార పక్షానికి మా సత్తా ఏంటో చూపిస్తాంఅని జనసైనికులు బోల్డంత ఆత్మవిశ్వాసంతో కన్పించేవారు. కానీ, క్రమక్రమంగా రాపాక వరప్రసాద్‌, వైఎస్సార్సీపీకి దగ్గరయిపోయారు. దీంతో జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు రాపాక పై రగిలిపోయి సోషల్ మీడియాలో తెగరచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే వారి గుండెలు మరింత మండి౦ప చేసే రాపాక వీడియో ఒకటి బయటకు వచ్చింది.

జగన్ పై తరగని అభిమానం ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వైసీపీ నుంచి అవకాశం దక్కించుకోలేకపోయాననీ, అందుకే జనసేనలో చేరాననీ, జనసేన నుంచి గెలిచిన వెంటనే వైఎస్‌ జగన్‌ని కలిశాననీ, ‘కలిసి పనిచేద్దాం’ అని జగన్‌ చెప్పారనీ, అప్పటి నుంచీ వైసీపీ నేతగానే చెలామణీ అవుతున్నాననీ ఆ వీడియోలో రాపాక చెప్పుకొచ్చారు. దీంతో ఆయన అసలు నైజం తెలిసిన జనసేన విస్తుపోయింది.‘నేను జనసేన ఎమ్మెల్యేనే.. పవన్‌ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరాను..’ అని మొదట్లో చెప్పిన రాపాక, జనసేనాని మెప్పు కోసం జగన్‌ మీద విమర్శలు చేసిన రాపాక..

ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు రాపాక గురించి చెప్పడానికి నమ్మకద్రోహం వెన్నుపోటు అన్న పదాలు చాలవని ఆవేశం ఆపుకోలేని జనసైనికులు సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాపాక విషయమై ఏ విధంగానూ స్పందించలేదు. జనసేనాని రెస్పాండ్ అయ్యేసరికి పుణ్యకాలం కూడా పూర్తయి పోతుందని సెటైర్లు కూడా పడుతున్నాయి. పార్టీనే నడపలేడని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయాడని ఆయన మీద ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయే ప్రమాదం పొంచి ఉంది.

author avatar
Yandamuri

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!