NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డ డిప్యూటి తహశీల్దార్ కటకటాల పాలు .. ఈ ఘటనపై స్మితా సబర్వాల్ ఏమన్నారంటే..?

అర్దరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి ఓ డిప్యూటి తహశీల్దార్ అక్రమంగా చొరబడి హాల్ చల్ చేయడం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ డిప్యూటి తహశీల్దార్ ఆనంద కుమార్ రెడ్డి అక్రమంగా ప్రవేశించాడు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ బిగ్గరగా కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఆనంద కుమార్ రెడ్డిని ఆమె భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో భద్రతా సిబ్బందితో అతను దురుసుగా ప్రవర్తించాడు.

Smita Sabharwal Shares on her experience when intruders broke into her house two arrested by Hyderabad police

 

ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తే డ్యూటీ విషయంలో మాట్లాడేందుకు వచ్చానని ఆయన చెబుతున్నాడు. డ్యూటీ విషయం మాట్లాడేందుకు అర్ధరాత్రి అక్రమంగా చొరబడాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ పరిణామంతో ఖంగుతిన్న స్మితా సబర్వాల్ వెంటనే జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డిప్యూటి తహశీల్దార్ ఆనంద కుమార్ రెడ్డితో పాటు అతనితో పాటు వచ్చిన స్నేహితుడు బాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ అంశం తెలంగాణ రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

సమయస్పూర్తితో రక్షించుకోగలిగాను

ఈ విషయంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అర్ధరాత్రి తన ఇంట్లోకి ఒ చోరబాటుదారుడు రావడం అత్యంత బాధాకరమని అన్నారు. సమయస్పూర్తిగా వ్యవహరించి అతని నుండి తనకు తాను కాపాడుకున్నానని తెలిపారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నామని భావించిన తలుపు తాళాలు సరిగా వేసి ఉన్నాయో లేదో అన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేయాలన్న గుణ పాఠం నేర్చుకున్నట్లు వివరించారు. అత్యవసరమైతే డయల్ 100 కి కాల్ చేయాలని స్మితా సబర్వాల్ సూచించారు. కాగా స్మిత సబర్వాల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనం

మరో పక్క ఈ అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్.. శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి గా క్షీణించాయని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకపోవడమే తెలంగాణ మోడలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!