‘మనోజ్ అరోడా ఎక్కడున్నాడు?’

Share

ఢిల్లీ, జనవరి 6: రఫేల్ డీల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ఎదురుదాడికి బిజెపి రాహుల్ గాంధీ కుటుంబంపై గురి పెడుతున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వధేరా సహాయకుడైన మనోజ్ అరోడాను కోర్టు ముందు నుంచోబెట్టేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి సృతి ఇరానీ రాహుల్‌నే కోరుతున్నారు.
ఆదివారం భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ లండన్ హౌస్ కేసుకు సంబంధించిన విషయంలో రాబర్ట్ వధేరాతో పాటుగా అతని సహాయకుడు మనోజ్ నిందితులని పేర్కొన్నారు. లండన్‌ హౌస్‌కు మరమ్మత్తుల విషయంలో 66వేల పౌండ్లను తన సహాయకుడు అరోడా ద్వారా వధేరా చెల్లింపులు చేశారని మంత్రి పేర్కొన్నారు. ఆదాయపన్నుశాఖ చేసిన దాడుల్లో ఈ వివరాలు వెలుగుచూశాయని చెప్పారు.
కోర్టుకు హాజరు కావాల్సిందిగా మనోజ్ అరోడాకు ఈడి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపినా స్పందన లేదు అని ఆమె అన్నారు. దీంతో ఈడి కోర్టు అరోడాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని చెప్పారు.
రాబర్ట్ వధేరా స్నేహితుడు సంజయ్ భండారీ నివాసంలో దేశ రక్షణకు సంబంధించిన డిజిటల్ దస్తావేజులు ఐటి అధికారుల దాడుల్లో వెలుగు చూశాయని మంత్రి గుర్తుచేశారు. ఈ విషయం పైనా రాహుల్ గాంధీ స్పందించాలని మంత్రి కోరారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 “గ్రాండ్ ఫినాలే” ఎపిసోడ్ ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??

sekhar

Salman Khan: సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ సెట్ కూల్చేశారు..! కారణం ఏంటంటే..

Muraliak

బ్రేకింగ్: ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్

Vihari

Leave a Comment