Snake Bite: పాము కాటుకు గురవుతున్న వారు ఎక్కువే.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు.. అదే మన దేశంలో అయితే సుమారు రెండు లక్షల మంది అని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములు ఉన్నప్పటికీ వాటిలో విషసర్పాలు 52 ఉన్నాయి.. మన ప్రాంతంలో మాత్రం 5 సర్పాలు అత్యంత విషాన్ని కలిగి ఉన్నాయి.. అవి కరిస్తే 3 గంటల లోపు ఆ మనిషి మరణిస్తాడు..!! మరి ఆ మూడు గంటల వ్యవధిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే..!? మనిషి ప్రాణాలు కాపాడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!!
పాము కరిచిన వెంటనే ఎన్ని గాట్లు పడ్డాయో చూసుకోవాలి.. అది కరిచిన చోట ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే విషపు పాము కరిచిందని అర్థము. మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే విష రహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరం లోకి వెళుతుంది. అక్కడి నుంచి గుండెకు, గుండె నుంచి మిగతా శరీర భాగాలన్నింటికీ చేరుకుంటుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే బతికే అవకాశాలు తక్కువ.
పాము కాటు వేసిన ప్రదేశం లో వెంటనే దానికి పైన గుండెకు ఈ విషం చేరకుండా గట్టిగా కట్టు కట్టాలి. ఇప్పుడు సూది లేని సిరంజి తీసుకుని దానితో అక్కడ ఉన్న రక్తాన్ని లాగాలి. మొదట ఈ రక్తం నలుపు రంగు లో వస్తుంది. కంగారు పడకండి ఇలా విషతుల్యమైన రక్తం. ఇలా 3 సార్లు రక్తాన్ని తీయాలి. ఇలా రక్తం తీసిన వెంటనే మనిషి స్పృహ లోకి వస్తారు. వాస్తవానికి పాము కోరల్లో 0.5 నుంచి 2 ML విషం ఉంటుంది. ఇలా చేసిన వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాలి. 3 గంటల లోపు హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని గుర్తుంచుకోండి.