భారతదేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ అంత ఈజీ కాదు ; అడుగడుగునా ఇబ్బందులు


(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

135 కోట్ల మంది భారతీయులు…

29 రాష్ట్రాలు…

4 కేంద్ర పాలిత ప్రాంతాలు…

739 జిల్లాలు..

60 శాతంపైగా యువత…

ఏడు కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు…

రెండు కోట్లకు చేరువలో కరోనా కేసులు… ఇవన్నీ భారతదేశం గణాంకాలు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కు రంగం సిద్ధమవుతున్న వేళ భారత్ ముందు ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. అసలు ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ సాధ్యమా? దీనిలో ఉన్న అడ్డంకులు ఏంటి? అసలు వ్యాక్సిన్ అందరికీ అవసరమా? యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటాయి? దేశీయ వ్యాక్సిన్ గా పేరొందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అభివృద్ధిని సమీక్షించేందుకు మోడీ హైదరాబాద్ వస్తున్న వేళ అసలు భారత్లో పంపిణీ సాధ్యమా అసాధ్యమా దీనిలో ఉన్న అసలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం రండి

1. మీకు తెలుసా?

భారత దేశం ప్రపంచానికి వ్యాక్సిన్ పవర్ పాయింట్ లాంటిది. ప్రపంచ దేశాలన్నీ వినియోగించే వ్యాక్సిన్ లలో 60 శాతంపైగా వ్యాక్సిన్లు భారతదేశంలోనే తయారవుతుంటాయి. పూణేలో ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టేక్ టీకాల తయారీలో అగ్రభాగంలో ఉంది. ప్రపంచంలో భారీగా టీకాలు తయారు చేసే సంస్థలు ఇండియాలో 10 వరకు ఉన్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే టీకాలు భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఆయా దేశాలు రూపొందించిన ఫార్ములాకు అనుగుణంగా ఇండియాలో టీకాలు తయారవుతుంటాయి. ఖచ్చితమైన నాణ్యత, జాగ్రత్త లు భారతదేశ కేక్ తయారీ సంస్థల్లో ఉంటాయని ప్రపంచ దేశాల్లోని కార్పొరేట్ సంస్థలు నమ్ముతాయి. ఇండియాలోని అమెరికా తయారీ సంస్థల కె ఇక్కడి నుంచే టీకాలు వెళుతుంటాయి. ప్రస్తుతం కరోనా టీకాల అభివృద్ధి తుది దశకు చేరుకున్న సమయంలో భారత్ నుంచే ఇవి తయారవుతాయని భావిస్తున్నారు.

2. భారత్ లో ఎంతమందికి టీకాలు?

భారతదేశంలో ఉన్న 135 కోట్ల మందికి టీకాలు వేసే అవకాశం చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూలై నాటికి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు ను సిద్ధం చేస్తోంది. వీటిని మొదట 25 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. టీకాలు వేయించడం లో భారత్ ఎప్పుడు ఓ చైన్ లింక్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏటా ఐదు కోట్ల మంది బాలింతలకు గర్భిణీలకు నవజాత శిశువులకు 39 కోట్ల వ్యాక్సిన్లను 12 రకాల వ్యాధుల కట్టడికి యంత్రాంగం పని చేస్తోంది. సుమారు 40 లక్షల మంది వైద్యులు, నర్సులు ఈ కాల పంపిణీ కార్యక్రమంలో నిరంతరం పాల్గొంటున్నారు.

 

3.సమస్యలు ఏమిటి అంటే?

బాక్సులు భద్రపరచడం అంటే మామూలు విషయం కాదు. భారతదేశంలో ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన దేశం. వ్యాక్సిన్లను 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చల్లగా భద్రపరచాలి. ప్రస్తుతం వేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి భారత్ వద్ద 29 వేల కోల్డ్ చైన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచే భారతదేశంలోని దాదాపు 80 లక్షల గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అత్యంత జాగ్రత్తగా రవాణా అవుతుంటాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ భద్రపరచడానికి ఇవి సరిపోతాయా అనేది ప్రధాన ప్రశ్న. ఇక డిస్పోజబుల్ సిరంజిల వినియోగం గణనీయంగా పెంచాలి. టీకా వేసేందుకు రెండు నుంచి మూడు సిరంజీవిలు అవసరం అవుతాయి. మరి ఇంత వేగంగా డిస్పోజబుల్ సిరంజిల తయారీ భారత్ సాధ్యమేనా అన్నది రెండో ప్రశ్న. ఇక వ్యాక్సిన్ వినియోగం తర్వాత వచ్చే బయో వ్యర్థాలను ఎలా నిర్వీర్యం చేస్తారనేది ఒక సమస్యే. ఇక వ్యాక్సిన్ రవాణా, దాని పంపిణీ విషయంలో కొత్త సిబ్బందిని నియమిస్తార లేక ఉన్న సిబ్బంది తో అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అనేది చూడాలి.

4. ముందు ఎవరికీ?

భారత్కు మొదట భారీ ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావు. కాబట్టి వచ్చే వ్యాక్సిన్లను ముందుగా ఎవరికి వేయాలి ఏమిటి అనేది ప్రధాన ప్రశ్నగా మారుతుంది. ఇక్కడే కొత్త కొత్త రాజకీయాలు పుట్టుకొస్తాయి. మొదట ఫ్రంట్లైన్ వారియర్ లకు వాక్సిన్ వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గతంలో ప్రకటించారు. అయితే కరోనా వైరస్ మధుమేహరోగులు పై ఎక్కువగా దాడి చేసే ప్రమాదం ఉన్నందున, ముందు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది వైద్యుల సూచన. ఫ్రంట్లైన్ వారియర్స్ లో ఆరోగ్య సిబ్బంది ఎక్కువగా ఉంటారు. ఆరోగ్య సిబ్బంది లో ప్రైవేట్ సిబ్బంది భారత్ లో ఎక్కువ. మొదట ప్రైవేట్ సిబ్బందికి ఇస్తారా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సిన్ను ఇస్తారా అనేది ప్రధాన ప్రశ్న. ఒకవేళ వారికి ఇస్తే దానికి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఇక దేశంలోని 29 రాష్ట్రాలకు ఒకేసారి వ్యాక్సిన్ పంపిణీ అసంభవం. కాబట్టి మొదట వైరస్ తీవ్ర ప్రభావం ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల ను ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్షపాతం అనే కొత్త వివాదాలు రావచ్చు.

5.అవినీతి, బ్లాక్ మార్కెట్ పై ద్రుష్టి అవసరం

వ్యాక్సిన్లను నిల్వ రవాణా పంపిణీ విషయంలో భారత్లో అంతులేని అవినీతి చోటు చేసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని అంచనా. మొదట ప్రభుత్వం రోజుకు కోటి డోసులు వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే భారత్ లో ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా అందరికీ వ్యాక్సిన్లు అందే అవకాశం ఉంటుంది. లేకుంటే వచ్చే వ్యాఖ్యలపై నిఘా ప్రమాణ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి ఆధార్ సంఖ్యకు కరోనా వ్యాక్సిన్ ను అనుసంధానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరి ని ట్రాక్ చేసే వీలు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే నకిలీ డోసుల మీద దృష్టి పెట్టకపోతే ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే కరోనా వ్యాక్సిన్ లు పక్కదారి పట్టకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాతే వ్యాక్సిన్ ల పంపిణీ మొదలుపెట్టాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే కరోనా వ్యాక్సిన్ ను భారీగా పక్కదారి పట్టి అవినీతి రాజ్యమేలుతుంది.

6.ధర విషయం లో…

కరోనా వ్యాక్సిన్ ధర విషయంలో ఇప్పటికీ అస్పష్టత ఉంది. భారత్ వంటి అతిపెద్ద దేశం లో భారీగా కరోనా వ్యాక్సిన్ ధరను పెడితే ప్రజలు దానిని స్వీకరించేందుకు ఇబ్బందులు పడతారు. మరోపక్క కొన్ని రాష్ట్రాలు ఎప్పటికీ కరుణ వ్యాక్సిన్ ను ఫ్రీగా వేస్తామని ఎన్నికల హామీలు ఇస్తున్నాయి. మరి కరోనా వ్యాక్సిన్ కు ఎంత ధర పెట్టాలి దానికి పరిమితులు ఏమిటో కేంద్రం ఆలోచించాలి. కేంద్రం అందరికీ ఉచితంగా వేస్తుందా లేక రాయితీలు ఇస్తుండడం ఎవరికీ ఉచితంగా అందిస్తుంది ఎవరు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలి అనేది పెద్ద ప్రశ్న. కరోనా వ్యాక్సిన్ రెండు రోజుల్లో ఉంటుంది ఒక డోసు వ్యాక్సిన్ ఖరీదు మూడు నుంచి నాలుగు డాలర్ల మేర ఉంటుంది. అంటే రెండు డోసులు కలిపి పది డాలర్లు ఉంటుంది. ప్రస్తుతం రూపాయి తో డాలర్ మారక విలువ ప్రకారం ఒక మనిషికి దాదాపు ఏడు వందల ఎనభై రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు చేయడం సాధారణ విషయం కాదు. ఈ బాధ్యతను మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దాదాపు 13 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని, ఇది దాదాపు 91 వేల కోట్లు ఉంటుందని అంచనా. కరుణ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయగలదా అనేది ఇప్పుడు ఉత్పత్తవుతున్న ప్రధాన ప్రశ్న. ఇక ఇప్పటికే వ్యాక్సిన్ను ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చిన రాజకీయ నాయకులు దీన్ని ఎలా భరిస్తారు అనేది, దానికి కేంద్ర ఒప్పుకుంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది.