NTR: ఎన్టీఆర్ 30వ సినిమాకి అంత సెట్..??

Share

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమా… కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ 30వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు అప్పట్లో.. ప్రకటన రాగానే ఆ తర్వాత త్రివిక్రమ్ కాకుండా కొరటాల శివ లైన్ లోకి వచ్చారు. అధికారిక ప్రకటన కూడా ప్రకటించారు. దీంతో గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “జనతాగ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో.. కచ్చితంగా ఎన్టీఆర్ 30వ సినిమా భారీ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

Koratala Siva and Jr. NTR movie official announcement tomorrow – Socially  Keeda | Socially Keeda

ఇదిలా ఉంటే ఇటీవలే “RRR” షూటింగ్ లో ఎన్టీఆర్ పాత్ర మొత్తం కంప్లీట్ అయినట్లు సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా తమ క్యారెక్టర్లకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న ట్లు.. తెలిపారు. దీంతో ఇప్పుడు నందమూరి అభిమానుల ఫోకస్ మొత్తం కొరటాల ప్రాజెక్ట్ పై ఉంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమా ప్రాజెక్టు అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి… ఆరు నెలల వ్యవధిలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

“జనతా గ్యారేజ్” తరహాలోనే ఒక మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా స్క్రిప్ట్ కొరటాల రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సమ్మర్ కి.. ఈ సినిమా రిలీజ్ చేయాలని పక్క షెడ్యూల్ తో… పకడ్బందీ షూటింగ్ కి కొరటాల రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ లేకుండా తిరుగులేని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా.. కొరటాల కి మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో.. ఎన్టీఆర్ 30వ సినిమా పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.


Share

Related posts

కే‌సి‌ఆర్ గేమ్ ప్లాన్ లో కుడితిలో పడ్డ ఎలకల్లా కొట్టుకుంటున్నారు వారంతా !

sekhar

బ్రేకింగ్ : చనిపోయిన దాసరి ఆస్తి కోసం కొట్టుకు ఛస్తున్నారు .. పోలీస్ స్టేషన్ లో రచ్చ

arun kanna

గోపీచంద్ పాత్ర‌ను ఆయ‌న చేస్తారా?

Siva Prasad