NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇంత‌కు ష‌ర్మిల‌మ్మా.. నీ పోటి ఎక్క‌డ‌…!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మైకు దొరికితే చాలు త‌న అన్న‌ను .. త‌న అన్న పార్టీ వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. త‌న తండ్రి పేరు చెపుతూ.. తాను రాజ‌న్న బిడ్డ‌ను అని చెపుతూ అన్న‌ను మాత్రం భారీగా టార్గెట్ చేస్తున్నారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. గ‌త రెండేళ్ల నుంచి తెలంగాణ‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి అక్క‌డ రాజ‌కీయం చేసుకుంటూ వ‌చ్చిన ఆమె ఎన్నిక‌ల‌కు ముందే బోర్డు తిప్పేశారు. తాను ఖ‌మ్మం జిల్లా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ బీరాలు పోయారు. ఎన్నిక‌ల కు ముందే పార్టీని ప్యాక‌ప్ చెప్పేసి త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు.

ఆమె అంత పార్టీ పెట్టి రెండేళ్ల పాటు రాష్ట్రం అంత‌టా తిరిగి చివ‌ర‌కు చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీలో త‌న పార్టీని వీలీనం చేస్తే ఆమెను కాంగ్రెస్ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. క‌నీసం ఆమె పోటీ చేసేందుకు అసెంబ్లీ సీటు కూడా ఇవ్వ‌లేదు. రేవంత్ అయితే ఆమె పార్టీని కాంగ్రెస్ లోకి తీసుకునేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. క‌ట్ చేస్తే ష‌ర్మిల ఏపీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసింది. దీంతో రేవంత్ కు అక్క‌డ ష‌ర్మిల నుంచి పోటీ లేకుండా పోయింది.

ఇప్పుడు రేవంత్ ష‌ర్మిల‌కు స‌పోర్ట్ చేస్తున్నాడు. నిన్న ఏపీలో విశాక‌ప‌ట్నంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డంతో పాటు ఏపీలో కాంగ్రెస్ ను గెలిపించాల‌ని కోరారు. కాంగ్రెస్ ను 5 పార్ల‌మెంటు, 25 అసెంబ్లీ సీట్ల‌లో గెలిపించాల‌ని రేవంత్ కోరారు. ష‌ర్మిల మాత్ర‌మే వైఎస్సార్ కు నిజ‌మైన వార‌సురాలు అని రేవంత్ అన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ష‌ర్మిల కాంగ్రెస్ నుంచి ఏపీలో ఎక్క‌డ పోటీ చేస్తుంది అన్న‌ది మాత్రం అంతు ప‌ట్ట‌డం లేదు.

మామూలుగా ష‌ర్మిల కు తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ఓటు హ‌క్కు ఉంది. ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డే ఓటు వేశారు. మ‌రి ఏపీలో ఆమెకు ఓటు లేదు. ఈ సారి ఆమె ఏపీలో పోటీ చేయాల‌నుకుంటే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు ? ఆమె మ‌న‌సులో ఏముంది ? అన్న‌ది మాత్రం బ‌య‌ట‌పడ‌డం లేదు. పులివెందుల అసెంబ్లీ లేదా క‌డ‌ప పార్ల‌మెంటు నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు.

కాంగ్రెస్ నుంచి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమె పులివెందుల లేదా క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని అంటున్నారు. ఒక వేళ ఆమె పోటీ చేసినా ఆమెకు స‌పోర్ట్ గా టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే మ‌ద్ద‌తుగా ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుంది. కానీ టీడీపీ వాళ్లు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ష‌ర్మిల కాంగ్రెస్‌లో ఉన్నందున ఆ ప‌ని టీడీపీ వాళ్లు చేస్తే బీజేపీ వాళ్ల‌కు కోపం వ‌స్తుంది.. అందుకే టీడీపీ కాంగ్రెస్ కు స‌పోర్ట్ చేయ‌దు. అందుకే ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలియ‌కుండా డైల‌మా ఉంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju