“లక్ష్మీ కల్యాణం” సినిమాతో వెండితెరకు పరిచయమై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసిన నటి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో నవదీప్ సరసన నటించి తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో రైలు పరుగెత్తేలా చేసింది ఈ చందమామా. ఇక 2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన “మగధీర” సినిమాలో నటించి మిత్రవిందగా సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది కాజల్.
ఆ తరువాత టాలీవుడ్ యంగ్ హీరోలైన రామ్, అల్లుఅర్జున్, ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనూ జతకట్టిన ఈ అమ్మడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా కొనసాగారు. ఇలా సినీ కెరియర్ సూపర్ స్పీడ్‌గా కొనసాగుతున్న తరుణంలోనే ఈ అందాల భామ పెళ్లి పీటలెక్కి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నప్పటికీ.. అవేవీ కట్టించుకోని కాజల్ తన వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త, తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది కాజల్. ఎందుకంటే పెళ్లి సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరిగాయి. ముంబయి తాజ్హోటల్లో జరిగిన ఆమె పెళ్లి వేడుకలో కాజల్ ధిరించిన గులాబీ రంగు లెహంగా కోసం దాదాపు 20 మంది డిజైనర్లు నెల రోజుల పాటు కష్టపడి ప్రత్యేకంగా తయారు చేశారట. దీని ధర రూ.3 లక్షలకు పైనే అని సమాచారం.
ప్రస్తుతం కాజల్, గౌతమ్‌ల జంట హనీమూన్ కోసం మల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు గడుపుతున్న తమ వైవాహిత జీవితానికి సంబంధించిన విషయాలను కాజల్ తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను చూస్తే.. ఆ జంట సందడి మాములుగా లేదనిపిస్తోంది. అయితే, తాజాగా కాజల్ ధరించించిన ఓ డ్రెస్ నెట్టింట్లో హాట్ టాపిగ్గా మారింది. ర్యాట్ అండ్ బోవా బ్రాండుకు చెందిన రెడ్ కలర్ సెమీ షీర్ డ్రెస్ ధరించిన కాజల్.. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, హ్యాట్ పెట్టుకుని మరింత హాట్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ డ్రెస్ ధర ఎంతవుంటుంది అనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనికి తోడు కాజల్, గౌతమ్ ల జంట ఓ భారీ పార్టీని ఏర్పాటు చేయనుందని సమాచారం. కాగా, కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడిగా “ఆచార్య” సినిమాలో నటిస్తోంది.