Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సోహైల్.. సన్నీ కి చెప్పిన సీక్రెట్..!!

Share

Bigg Boss Telugu 5: దీపావళి సందర్భంగా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో… సందడి వాతావరణం ఏర్పడింది. హౌస్ లోకి మాజీ బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు. ముక్కు అవినాష్, బాబా మాస్టర్, అరియనా, సోహెల్.. మరికొంతమంది..హౌస్ లో అడుగు పెట్టి ఇంటి సభ్యులను అలారించడం జరిగింది. ముక్కు అవినాష్ భారీ స్థాయిలో ఇంటిలో సభ్యులపై పంచ్ డైలాగులు వేయడం జరిగింది. పింకీ పై అదేరీతిలో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jashwanth) పై… గట్టిగా డైలాగులు వేయడం జరిగింది. ఇదే సమయంలో సిరి పై కూడా అవినాష్ పంచ్ డైలాగులు వేసి.. హౌస్ లో సరికొత్త వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. షణ్మక్..సిరి(Siri) మోజో రూమ్ లో… సరదాగా సంభాషించే విషయాలను అవినాష్(Avinash) ప్రస్తావిస్తూ కామెడీ చేసాడు.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates |  Tv News – India TV

కాగా ఇదే సమయంలో సోహెల్ ఎంట్రీ ఇచ్చి.. ఫుల్ ఎనర్జీతో ఇంటి సభ్యులతో గేమ్ ఆడటం జరిగింది. తన సీజన్లో కొంతమంది మాత్రమే.. కోపం గా ఉండే వాళ్ళు కానీ సీజన్ ఫైవ్ ప్రతి ఒక్కరూ కోపంగా ఉన్నారని సోహెల్ ఇంటి సభ్యులనుద్దేశించి డైలాగ్ చేశారు. అందరితో చాలా ఫన్నీగా మాట్లాడినా సోహెల్(Sohail) చివరిగా వెళ్ళిపోయే ముందు సన్నీకి సీక్రెట్ చెప్పడం జరిగింది. బయట నీకు ఫాలోయింగ్ మామూలుగా లేదు, “నీ గేమ్ నువ్వు ఆడు అంటూ” సన్నీ(Sunny)కి సోహెల్ టిప్స్ చెప్పడం జరిగింది. కొంచెం కోపం తగ్గించుకునీ, మీ తప్పు లేనప్పుడు… ఎవరిది వారికి ఇచ్చేయ్. ఈ విధంగా గేమ్ ఆడుకుంటూ పోతే నీకు తిరుగుండదు. నిన్ను కొట్టే మగాడే హౌస్ లో ఉండడు. సగం సీజన్ పూర్తి కావడంతో ఇప్పటి నుండి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుందని, ప్రతి మాట చాలా విలువైనది. చాలా ఆచితూచి మాట్లాడాలని ఇంటి సభ్యులకు… సోహెల్ వివరించాడు. అదే రీతిలో ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఆస్వాదించాలని ప్రతి ఒక్కరితో కలుపుకుని పోవాలని గేమ్ పరంగా ఎవరికివారు రాణించాలని… తెలియజేస్తూ అందరికీ సోహల్ ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది.

 

సోహెల్ హౌస్ లో .. సరికొత్త వాతావరణాన్ని  క్రియేట్ చేయడం…

ఇదిలా ఉంటే సీజన్ ఫోర్ లో హౌస్ లో సోహెల్ ఏ మాదిరిగా గేమ్ ఆడటం జరిగిందో… అదే రీతిలో సీజన్ ఫైవ్ లో సన్నీ ఆట తీరు ఉందని బయట జనాల టాక్. సీజన్ ఫోర్ లో… టాప్ ఫైవ్ కి వెళ్ళిన సోహెల్… క్యాష్ ప్రైస్ గెలవడం జరిగింది. దుమ్ము దులిపే టైప్ లో గేమ్ ఆడాడు. హౌస్ లో చాలా సందర్భాలలో అరియనా తో… గొడవ పెట్టుకున్న సోహెల్ బయటకొచ్చాక ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అంత మాత్రమే కాక ఫ్రెండ్ షిప్ కి.. మంచి వ్యాల్యూ ఇవ్వడం జరిగింది. అఖిల్..మోనాల్ తో… మంచి బాండింగ్ క్రియేట్ చేసుకుని హౌస్ లో .. సరికొత్త వాతావరణాన్ని సోహెల్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక్క కోపం మినహా మిగతా అన్ని విషయాల్లో సోహెల్ మాస్క్ లేని గేమ్ ఆడటం జరిగింది. ఇప్పుడు ఇదే రీతిలో సన్నీ కూడా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వటంలో… తనదైన శైలిలో మానస్ తో… ఉంటూ మరోపక్క టాస్క్ లలో రెచ్చి పోతున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అప్పట్లో సోహెల్ మాదిరిగానే.. సన్నీ ఈ సీజన్లో ఆడుతున్నాడని జనాలు అంటున్నారు. ఇటువంటి తరుణంలో హౌస్ లో అడుగుపెట్టిన సోహెల్.. సన్నీకి టిప్స్ చెప్పడం చాలా హైలెట్ అని దీపావళి ఎపిసోడ్ చాలా బాగుందని వీక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

ప్రతి స్త్రీ తన రక్షణ కోసం కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఇవే ??(పార్ట్ -1)

siddhu

335వ రోజు జగన్ పాదయాత్ర

somaraju sharma

Payal Rajput : ఆర్ఎక్స్100 హీరోయిన్ మరో మైలురాయిని చేరుకుంది..

bharani jella