బిగ్ బాస్ హౌస్ లో టాప్ త్రీ లో పాతిక లక్షలు గెలుచుకున్న సోహెల్ కి బయట మంచి రెస్పాన్స్ మాత్రమే కాక భారీ అభిమానం సంపాదించుకున్నాడు. టైటిల్ విన్నర్ అభిజిత్ గెలిచిన గాని సోహెల్ ఆడిన ఆట తీరు చాలా మందిని ప్రభావితం చేసిందని సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. కమెడియన్ బ్రహ్మానందం కూడా సోహెల్ ఆటకి ఫిదా అవటమే కాకుండా సోహెల్ సినిమా తీస్తే అందులో డబ్బులు ఏమి తీసుకోకుండా నటిస్తాను అని బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు.
అదేవిధంగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నాడు చిరంజీవి కూడా సోహెల్ కి కెరియర్ పరంగా భరోసా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో స్టార్ మా నుండి కూడా సోహెల్ కి అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చినట్లు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మేటర్ ఏమిటంటే బిగ్ బాస్ ఐదవ సీజన్ కి హోస్ట్ గా సోహైల్ కి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలోనే స్టార్ మా లో ఒక సీరియల్ లో సోహెల్ నటించడంతో.. ఆ చనువుతో సోహెల్ కి తాజాగా వచ్చిన క్రేజ్ బట్టి వచ్చే బిగ్ బాస్ సీజన్ కి యాంకరింగ్ చేయాలని ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే గనుక నిజమైతే సోహెల్ పంట పండినట్లే అని తాజా వార్త పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.