Sohel : సోహెల్ Sohel గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లో సోహెల్ గురించి అందరికీ తెలిసింది. అంతకుముందు సోహెల్ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నా.. సోహెల్ కు అంత గుర్తింపు రాలేదు కానీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగానే సోహెల్ కు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగింది.

సోహెల్ లో ప్రతి ఒక్కరు తమను తాము చూసుకునేవారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సోహెల్ చేసిన పనులకు అందరూ ఫిదా అయిపోయారు.
అయితే.. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్స్ మెహబూబ్ దిల్ సే, అరియానాతో సోహెల్ సరదాగా గడిపాడు. మెహబూబ్ దిల్ సే.. సోహెల్, అరియానా… ఇద్దరితో కారులో వెరైటీగా ఇంటర్వ్యూ చేశాడు.
Sohel : సోహెల్, అరియానా మధ్య ఉండేది ఎమోషనల్ బాండింగ్
సోహెల్, అరియానా మధ్య ఉన్నది ఎమోషనల్ బాండింగ్.. అంటూ సోహెల్ తన ఇంటర్వ్యూలో బాగంగా చెప్పుకొచ్చాడు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో తనకు నచ్చిన కంటెస్టెంట్లు అంటే మాత్రం అరియానా, దివి.. అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు సోహెల్.
ఇలా.. ఇంటరెస్టింగ్ ప్రశ్నలను సోహెల్, అరియానాను మెహబూబ్ దిల్ సే అడగడం.. వాళ్లు చెప్పడం.. అది కూడా కారులో హైదరాబాద్ అంతా తిరుగుతూ చేసిన హంగామా మామూలుగా లేదు.
ఈ వీడియోను మెహబూబ్ దిల్ సే తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. వీళ్ల వెరైటీ ఇంటర్వ్యూను మీరు కూడా చూసేయండి.