Biggboss Utsavam : అని స్టార్ మాలో కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. అంటే.. బిగ్ బాస్ 4 Biggboss Utsavam కంటెస్టెంట్లకు అదొక రీయూనియన్ అన్నమాట. గెట్ టుగెదర్ పార్టీ అని కూడా అనుకోవచ్చు. ఇది ప్రైవేట్ పార్టీ అంటూ స్టార్ మా తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరూ కలిసి తెగ హంగామా చేశారు.
మామూలుగా బిగ్ బాస్ హౌస్ లోనే వీళ్లు చేసిన హంగామా చూసి తట్టుకోలేకపోయాం. ఇక.. వీళ్లంతా బయట అది కూడా ఓ ప్రైవేటు పార్టీలో కలిస్తే రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోగలమా? రచ్చ రంబోలా చేశారు. అందరూ కలిసి పార్టీలో కుమ్మేశారు. ఎంటర్ టైన్ మెంట్, డ్యాన్సులు, కామెడీ.. ఇలా సరదాగా ఈ ప్రోగ్రామ్ సాగిపోయేలా స్టార్ మా డిజైన్ చేసింది.
Biggboss Utsavam లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సోహెల్, మెహబూబ్
సోహెల్, మెహబూబ్ ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్ కు రాకముందు వాళ్లలో ఒకరికి మరొకరు తెలియదు. కానీ.. బిగ్ బాస్ హౌస్ కు వచ్చాక.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అది జీవితకాలం పాటు కొనసాగుతుందని.. వీళ్లు చాలా చోట్ల చెప్పారు. అసలు.. ఏ బిగ్ బాస్ సీజన్ లో కూడా ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ను చూడలేదు.
ఇద్దరు ఒకరి కోసం మరొకరు.. ఏదైనా చేస్తారు. అంత బెస్ట్ ఫ్రెండ్ షిప్ వాళ్లది. అయితే.. బిగ్ బాస్ ఉత్సవంలో వీళ్లిద్దరే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ లుంగీలు కట్టి.. చేసిన డ్యాన్స్, హడావుడి మామూలుగా లేదు. దానికి సంబంధించిన ప్రోమోను మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్ లో షేర్ చేశాడు. మీరు కూడా వాళ్ల హంగామాకు సంబంధించిన ప్రోమోను చూసేయండి. పూర్తి వీడియో కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=9O-VJkIFnhg