బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నెక్స్ ట్ మినట్ ఏం జరుగుతుందో బిగ్ బాస్ కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకే దాన్ని రియాల్టీ షో అంటున్నారు. కంటెస్టెంట్లు కూడా అక్కడ ఉండాలంటే దిమాక్ పెట్టి ఆట ఆడాల్సి వస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికే 13 వారాలు పూర్తయ్యాయి. 14వ వారంలోకి బిగ్ బాస్ అడుగుపెట్టింది.

ఈ వారంతో నామినేషన్ల ప్రక్రియను ముగించేస్తున్నారు. అంటే ఈ వారమే చివరి నామినేషన్ల ప్రక్రియ ఉండబోతోంది. అందుకే బిగ్ బాస్ ఆఖరి వారం నామినేషన్లను సరికొత్తగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే.. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే అదే అనిపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే.. ఓ బజర్ మోగుతుంది. బజర్ మోగగానే… అరియానా, సోహెల్.. ఇద్దరూ వేగంగా పరిగెత్తుతూ గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ ఒక కిరీటం ఉంటుంది. ఆ కిరీటాన్ని సోహెల్ చేజిక్కించుకుంటాడు. దీంతో సోహెల్.. బిగ్ బాస్ హౌస్ లో కింగ్ అవుతాడు.
దీంతో బిగ్ బాస్ రాజ్యంలో కింగ్ అయిన సోహెల్ మాటను మిగితా ఇంటి సభ్యులంతా తూచా తప్పకుండా పాటించాలన్నమాట. తన అధికారంతో అరియానాకు చుక్కలు చూపిస్తాడు సోహెల్.
ఇదంతా ఓకే కానీ.. సోహెల్ రాజవడం.. నామినేషన్లకు ఏంటి సంబంధం అనేదే ప్రస్తుతం ప్రేక్షకుల్లో తొలుస్తున్న ప్రశ్న. దీని గురించి పూర్తిగా తెలియాలంటే మాత్రం ఇవాళ్టి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.