Sohel : సోహెల్ Sohel గురించి తెలుసు కదా. మనోడు ఖతర్నాక్. సోహెల్ అంటే పడి చచ్చిపోని అమ్మాయి లేదు. అద సోహెల్ కు ఉన్న ఫాలోయింగ్. అమ్మాయిల రాకుమారుడు సోహెల్. అయితే.. సోహెల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక్క అమ్మాయికి కూడా లైన్ వేయలేదు. హౌస్ లో ఉన్న ఏ ఒక్క లేడీ కంటెస్టెంట్ కు లైన్ వేయకుండా ఉన్నాడు ఈ లవర్ బాయ్.
అరియానాతో సోహెల్ కు మంచి బంధం ఉన్నప్పటికీ.. తనకు ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. కాకపోతే వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అరియానా.. అవినాష్ కు కనెక్ట్ అయినప్పటికీ.. సోహెల్ తో బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఉంది తనకు.

బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నది ఎవరు అని అడిగితే టక్కున సోహెల్ అని చెప్పొచ్చు. అది సోహెల్ రేంజ్. అయితే.. తాజాగా సోహెల్.. కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ లో మెరిశాడు.
Sohel : అరియానాకు లైన్ వేయకుండా వేరే అమ్మాయికి సోహెల్ లైన్?
కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో అవినాష్ స్కిట్ లో గెస్ట్ గా వచ్చిన సోహెల్.. కథ వేరే ఉంటది అనే సినిమాకు హీరోగా నటించాడు. దాంట్లో హీరోయిన్ అరియానా. నిజానికి సోహెల్.. అరియానాకు లైన్ వేయాల్సి ఉంటుంది. కానీ.. కావాలని అరియానాను పక్కన పెట్టి.. సిరి అనే అమ్మాయికి లైన్ వేస్తాడు. దీంతో కోపం పట్టలేక.. హౌస్ లో ఉన్నప్పుడు లైన్ వేయలేదు.. నీ సంగతేంట్రా… ఇక్కడ లైన్ వేయలేదు. కానీ.. అమ్మాయిలు కనిపిస్తే మాత్రం సొంగ కారుస్తున్నావా? అంటూ సోహెల్ ను ఎడా పెడా వాయించేసింది అరియానా. దీంతో హౌస్ లో లైన్ వేద్దామంటే మధ్యలో అవినాష్ వచ్చిండు కదా.. ఎలా లైన్ వేసేది అంటూ సోహెల్ భలే పంచ్ వేసే సరికి.. అరియానాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
మొత్తం మీద ఈసారి అవినాష్.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లను తీసుకొచ్చి కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో బాగానే కామెడీ పంచాడు. ముఖ్యంగా సోహెల్ రావడంతో కామెడీ స్టార్స్ కే సరికొత్త అందం వచ్చింది.
దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.