కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4 లో మొత్తం 16మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా అందులో సయ్యద్ సోహెల్ కూడా ఒకడు. బిగ్ బాస్ తో సోహెల్ కి మంచి గుర్తింపు లభించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ కు రాకముందు సోహెల్ కొన్ని సినిమాలలో నటించాడు. అవి యురేకా, కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు సోహెల్.
జనతా గ్యారేజ్ సినిమాలో కూడా సోహెల్ నటించాడు. ఆ సినిమాలో హీరో, హీరోయిన్లు కలిసి ఒక టూర్ కి వెళ్ళినప్పుడు వాళ్లతో పాటు వెళ్లిన ఇంకొంత మంది స్నేహితులలో సోహెల్ కూడా ఒకడు. ఆ తర్వాత స్టార్ మా లో కృష్ణవేణి అనే సీరియల్ లో నటించాడు. హౌస్ లో తన హ్యూమర్ తో, ఆడే విధానంతో, హౌస్ మేట్స్ తో కూడా స్నేహంగా ఉంటూ ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఇలా చివరి వారానికి టాప్ థర్డ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే, సోహెల్ బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడు తాను అంతకు ముందే కొన్ని సినిమాలు చేశాను అని చెప్పాడు కూడా.
బిగ్ బాస్ నుంచి తనకి వచ్చిన మొత్తంలో ఆశ్రమానికి కొంత మొత్తాన్ని ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్పాడు. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవిని “నా సినిమాకి మీరు మద్దతు ఇస్తారా?” అని సోహెల్ అడిగాడు. అందుకు చిరంజీవి ఏ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం అని భరోసా ఇచ్చారు. అలాగే టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మనందం కూడా సోహెల్ సినిమాలో నటించడానికి ఏ రెమ్యూనరేషన్ తీసుకోను అని చెప్పారట. ప్రస్తుతం సోహెల్ హీరోగా వచ్చే సినిమాకి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.