బిగ్బాస్ ఇంట్లోకి ప్రతి సీజన్లో దాదాపు ఒక ఇరవై మంది వస్తుంటారు. అయితే వారిలో ప్రేక్షకాదరణ పొంది ప్రభావం చూపించేది ఒక ఐదుగురు ఆరుగురు మాత్రమే. ఈ సీజన్లో అఖిల్, సోహెల్, మోనాల్ కూడా ఆ కొద్దిమందిలో ఉన్నారనే చెప్పా. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన వీరి ముగ్గురు బిగ్ బాస్ వల్ల పాపులర్ అయ్యారు.
ఇకపోతే తాజా ఇంటర్వ్యూలో అఖిల్-మోనాల్ కి సంబంధించిన సీక్రెట్ ఒకటి సోహెల్ లీక్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిన సోహెల్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో మెరిశాశు. ఈ సందర్భంగా యాంకర్ అరియానా, మోనాల్. హారిక లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే…. సోహెల్ ఊహించని సమాధానం చెప్పాడు.
అరియానా ను పెళ్లి చేసుకుంటానని సోహెల్ అందరికీ షాక్ ఇచ్చాదు. అలాగే మోనాల్ తనకు చెల్లితో సమానం అని అన్నాడు. అక్కడితో ఆగితే బాగుండేది అయితే సోహెల్ మాత్రం మోనాల్ నాకు సిస్టర్ టైప్ అయినా ఆమెకు అఖిల్ ఉన్నాడుగా…. వాడు చేసుకుంటాడు అని నోరు జారాడు. తర్వాత కవర్ చేసుకుంటూ ఏవేవో కథలు చెప్పారు కానీ సోషల్ మీడియాలో అతని కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇదంతా ఒక లెక్క అయితే అరియానాతో సోహెల్ ఇంటిలో అనేక సార్లు గొడవ పడ్డాడు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునే స్థాయి కి వెళ్ళాడు. మరి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం కూడా ఆసక్తికరమైన విషయమే.