Nani: నాని కెరీర్‌లోనే ఇలాంటి సాలీడ్ ఆఫర్ మొదటిసారి..

Share

Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి – కృతి శెట్టి హీరోయిన్స్‌గా, మడోనా సెబాస్టియన్ కీలక పాత్రలో నటించించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. గత కొంతకాలంగా నానికి ఆశించిన సక్సెస్ దక్కడం లేదు. దాంతో ఇప్పుడు రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచాయి.

solid offer in nani-career
solid offer in nani-career

ఇటీవల వచ్చిన ఒక్క సిరివెన్నెల పాటే శ్యామ్ సింగ రాయ్ సినిమాపై అసాధారణమైన అంచనాలను పెంచింది. ఇక నాని కెరీర్‌లో కూడా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో భారీ బడ్జెట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ కావడం విశేషం. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మించాడు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఇప్పటి వరకు నాని కెరీర్‌లో ఏ సినిమాకు రాని ది బెస్ట్ ఆఫర్ ఈ సినిమాకు వచ్చిందట.

Nani: శ్యామ్ సింగ రాయ్ సినిమా మీద సక్సెస్ మీద అందరూ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతోంది.

ప్రముఖ ఛానల్ జెమినివారు రూ.10 కోట్లకు శ్యామ్ సింగ రాయ్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారట. నాని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా కూడా ఇలాంటి సాలీడ్ ఆఫర్ అంటే శ్యామ్ సింగ రాయ్ సినిమా  సక్సెస్ మీద అందరూ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతోంది. చూడాలి మరి నానికి ఈ సినిమా ఏరేంజ్‌లో సక్సెస్ ఇస్తుందో. ఇక నాని ఈ సినిమా తర్వాత ‘అంటే సుందరానికి’, ‘దసరా’ చిత్రాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.


Share

Related posts

సోనూ సూద్ మరో సాయం.. తెలంగాణ బాలుడికి 20 లక్షలు

Varun G

Garuda Vardhanam: మన ఇంట్లో ఉండే ఈ బంగారం మొక్క గురించి మనం తెలుసుకోకపోతే ఎలా..!!

bharani jella

Swasika Saree Latest Photos

Gallery Desk