‘సోలో బ్రతుకే సో బెటర్’ మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్ నభా నటేష్ జంటగా నటించిన తాజా చిత్రం. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ మూతపడిన కారణంగా మేకర్స్ రిలీజ్ చేయలేదు. ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చినా సాయి ధరం తేజ్ నో అన్నాడు. ఎట్టకేలకి ఈ సినిమా అన్నీ అవాంతరాలను దాటి థియేటర్స్ లో రిలీజైంది.
అయితే ఈ సినిమా మీద హీరోయిన్ నభా నటేష్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. రవితేజ తో డిస్కో రాజా చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా నభా నటేష్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో సాయి ధరం తేజ్ తో చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో .. ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజై యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంది.
దాంతో నభా నటేష్ కి ఈ సినిమా ప్లస్సా మైనస్సా అని టాక్ మొదలైంది. వాస్తవంగా అయితే సాయి ధరం తేజ్ కి జంటగా నభా నటేష్ పర్ఫెక్ట్ జోడీ అని చెప్పుకుంటున్నారు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా నభా నటేష్ సినిమాకి బాగా ప్లస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. మరి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి కెరీర్ పరంగా సోలో బ్రతుకే సో బెటర్ నభా నటేష్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరో నితిన్ సరసన అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. మరి ఈ సినిమా సక్సస్ ని బట్టి నభా నెక్స్ట్ లెవల్ ఏంటన్నది తెలుస్తుందని అంటున్నారు.