పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరసగా తాజా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయో సినిమా తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రాల కి సంబంధించిన అధికారక ప్రకటన ని ఇచ్చారు.
ఇలాంటి సమయంలో మాధవీ లత పవన్ కళ్యాణ్ కి చిన్న షాక్ ఇచ్చింది. దాదాపు 10 ఏళ్ళ క్రితమే పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి ‘ అనే టైటిల్ తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తి తో “సత్యాగ్రహి” సినిమాని నిర్మించబోతున్నారు. శ్రీ భవిత క్రియేషన్స్ పతాకం పై గంగారెడ్డి నిర్మిస్తుండగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మాధవి లత ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ ని బట్టి ఈ సినిమాలో మాధవి లత పొలిటికల్ క్యారక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా తీసుకొని తన సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజం పై యువత బాధ్యత తో ఉండాలని చెబుతూ … పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయిన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక పవర్ స్టార్ టైటిల్ పెట్టుకొని సినిమా చేస్తున్నందుకు హీరోయిన్ మాధవీలత ని కొంతమంది ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తుంటే కొంతమంది మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారట.