NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సచివాలయాలు…. మొదటికే మోసం తెస్తున్నాయా…?

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా అతనికి విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ అయితే అతనిపై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలు కొన్ని సర్కార్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యనే సచివాలయంలో అవినీతి బయటపడడం కొంతమంది వాలంటీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడం…. అంతేకాకుండా గ్రామస్తులకు కాలం గడిచే కొద్దీ వస్తున్న కొత్త అనుభవాలు జగన్ ప్రభుత్వానికి కొద్దిగా వణుకు పుట్టిస్తున్నాయి.

 

Finally, YSRCP decides to repaint all Government buildings - Gossiper

వివరాల్లోకి వెళితే…. సచివాలయం కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ వాటిని ఏర్పాటు చేసే విషయంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి కి తలనొప్పిగా మారాయి. గ్రామ సచివాలయ భవనం ఏర్పాటు కోసం అధికారులు కొన్ని స్థలాలను కేటాయించారు. అవి కాస్తా వివాదాస్పదంగా మారాయి. భూములు అధికార పార్టీకి చెందిన నేతలు సచివాలయాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలేని లక్షలాదిమందికి భూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఒక పక్క చేపడుతున్న ప్రభుత్వం ఇలా ఉన్న వారి దగ్గర భూములను లాక్కొని సచివాలయ భవనాలను నిర్మిస్తున్నారన్న విమర్శ చాలా దారుణంగా ఉంది. కొన్నిచోట్ల అధికారుల అత్యుత్సాహం కారణంగా పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

తాజాగా అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామం లో ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ప్రతి పంచాయతీకి ఒక సచివాలయ భవనాన్ని రైతు భరోసా కేంద్రాన్ని వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. అధికారులు సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని చదును చేసే ప్రయత్నంలో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఆ భూమి ఆన్లైన్ లో కూడా తమ పేరునే ఉందని చెప్పినా అధికారులు వినలేదు. అధికార పార్టీ నేత ఇన్వాల్మెంట్ కారణంగానే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంది అని మహిళా రైతు లక్ష్మీదేవి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్ళింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను గమనించుకొని సచివాలయ శాఖ ఉద్యోగులను మిగతా ప్రభుత్వ వారితో కలిసి పని చేసే విధంగా ఒక ఫార్మేట్ రూపొందిస్తే సరిపోతుందని అంటున్నారు. లేకపోతే వీరిని సపరేట్ యూనిట్ గా ఉంచి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తే చివరికి ప్రభుత్వం వారు భారీగా ఇబ్బంది పడతారని భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా ప్రభుత్వ కార్యకలాపాలలో ఎటువంటి అవినీతి ఉండకూడదు అని.. జనాలకి అత్యంత చేరువగా ప్రభుత్వ సేవలను అందించాలని మొదలుపెట్టిన సచివాలయంలోనే ఇలా జరుగుతుండడం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.

author avatar
arun kanna

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N