NewsOrbit
న్యూస్

సోము మాటల ధాటికి కామ్ అయిపోయిన యాంకర్ ఎవరు?

ఒక్కో సినిమాలో నాయకుడు కన్నా ప్రతినాయకుడి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అతడికి ఎక్కువ పేరు కూడా వస్తుంది.ఇదే పరిస్థితి ఇప్పుడు టీవీ9 యాంకర్ రజనీకాంత్ కి ఎదురైంది .టీవీ9 లో ప్రతిరోజు సాయంత్రం బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని రజినీకాంత్ నిర్వహిస్తారు.

somu shocks to anchor
somu shocks to anchor

ర‌జినీకాంత్ స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని  ప్ర‌శ్న‌లు సంధిస్తూ చ‌ర్చ‌ను ర‌క్తి క‌ట్టిస్తుంటారు.పెద్దపెద్ద నాయకుల నే రజినీకాంత్ బోల్తా కొట్టిస్తుంటారు. కానీ అలాంటి రజినీకాంత్ బిజెపి నూతన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కు అడ్డంగా చిక్కిపోయాడు. రజినీకాంతు కి సోము వీర్రాజు చెమటలు పట్టించాడు.ఒకరకంగా సోము వీర్రాజు ఆయనతో చెడుగుడు ఆడుకున్నాడు. టీవీ9 లో మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన బిగ్ డిబేట్ ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగింది. ఏపీ రాజ‌కీయాల‌ను మూడు రాజ‌ధానుల అంశం వేడెక్కిస్తున్న నేప‌థ్యంలో “ఏపీ పొలిక‌ల్ జంక్ష‌న్‌లో వీర్రాజు ఫార్ములా ఏంటి?” అనే ప్ర‌శ్న‌తో ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు సోము వీర్రాజుతో ర‌జినీకాంత్ చేసిన చ‌ర్చ ఆద్యంతం ఆస‌క్తి క‌లిగించింది.

సోము వీర్రాజుపై ర‌జినీకాంత్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాజ‌కీయం కాదు…ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త కావాల‌ని, అది మీరు ఇవ్వాలంటూ రెట్టిస్తూ ప్ర‌శ్నించారు. ..స్ప‌ష్ట‌త కావాల‌నే ప్ర‌శ్న‌పై సోము దీటైన స‌మాధానం ఇచ్చారు. వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు ఇచ్చార‌న్నారు. అదే త‌మ‌కు అధికారం ఇస్తే ఆరు నెల‌ల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. కేంద్రంలో త‌మ పార్టీకి అధికారం ఇవ్వ‌డం వ‌ల్లే చైనా స‌మ‌స్య‌, ఆర్టిక‌ల్ 370 స‌మ‌స్య (జ‌మ్మూలో), అలాగే అయోధ్య స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి రాముడి గుడి క‌డుతున్నామ‌ని చెప్పుకొచ్చారు. దీంతో ర‌జినీకాంత్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాని ప‌రిస్థితిని సోము వీర్రాజు కలిపి౦చారు. వెంటనే రజినీకాంత్ తేరుకొని మరో ప్రశ్న వేశారు.


“మీరు ఎద‌గాలంటే అధికార పార్టీ మీద పోరాటం చేయాలి. కానీ ప్ర‌తిప‌క్ష పార్టీ మీద పోరాటం చేస్తున్నారట క‌దా ?” అని   ర‌జ‌నీకాంత్ సూటిగా ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌కు  సోము వీర్రాజు జవాబిస్తూ
“అది మీకెందుకు ఇబ్బంది? ఎవ‌రి మీద పోరాటం చేస్తే ఏం జ‌రుగుతుందో మాకంటూ ఓ అంచ‌నా ఉంటుంది క‌దా. అది కూడా మీరు డిసైడ్ చేస్తే ఎలాగండి ర‌జినీకాంత్ గారూ అని సోము వీర్రాజు కౌంటర్ వేశారు.వాళ్ల మీద మాట్లాడొద్దు…వీళ్ల మీదే మాట్లాడాలి… అంటే మీ డైరెక్ష‌న్‌లో వెళ్లాలా మేము.

మాకంటూ డైరెక్ష‌న్ ఉండ‌కూడ‌దా? ఇదేంటండి ర‌జినీకాంత్ గారు. మీరు ధ‌ర్మ‌ప్ర‌భువులు. అలా చేస్తే(అడిగితే) ఎలా సార్‌?  మీరు తెలుగుదేశాన్ని అనొద్దు…వైసీపీని అనండి …మేము ఎవ‌ర్ని అనాలి? ఏం చేయాలి? అనే ల‌క్ష్యం, ఆలోచ‌న మాకు ఉండ‌కూడ‌దా?  ద‌య‌చేసి చెప్పండి. వాళ్ల‌నే(వైసీపీని) అనండి?  వాళ్ల‌ను(టీడీపీని) ఎందుకంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారేంటి?  నాకు అర్థం కాదు. మీకు ఇబ్బంది ఏంటి? అని ఆయన తన సహజ ధోరణిలో రజినీకాంత్ ని నిలదీశారు.మొత్తం మీద ఇన్నాళ్ళకు రజనీకాంత్ కు సరైన సమాధానం ఇచ్చే రాజకీయ నేత దొరికాడని మీడియా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు

author avatar
Yandamuri

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju