NewsOrbit
న్యూస్

దెబ్బేసిన సోము ! సుజనా ఆశలకు జనగణమన !!

ఎన్నో ఆశలతో అంచనాలతో బిజెపిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇప్పుడు అందుకు చింతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

somu veeraju twists to sujana chowdary
somu veeraju twists to sujana chowdary

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోగానే సుజనాచౌదరి మరో ముగ్గురు పార్టీ ఎంపీలను కలుపుని బిజెపిలో చేరి పోయారు.టిడిపి బిజెపి పొత్తు ఉన్న సమయంలో నరేంద్ర మోడీ కేబినెట్లో సుజనా చౌదరి మంత్రిగా కూడా పని చేసినందువల్ల ప్రధాన మంత్రితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావించారు.మళ్లీ అవకాశం వస్తే సుజనా చౌదరికి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి పదవిని ఇవ్వగలరని కూడా అంచనాలు లేకపోలేదు.కానీ కాలం కలిసి రానప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు.

ప్రస్తుతం సుజనాచౌదరి టైమ్ అసలు ఏమీబాగా లేదట! అన్నిటికీ మించి సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావడంతో సుజనా చౌదరి పని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ సుజనా చౌదరి మంత్రి పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకూ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే గత నెల్లాళ్లుగా ఆయనకు ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి.సుజనా చౌదరి హడావిడి మామూలుగా ఉండదు. బీజేపీకి తానే ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ ను అంటూ తిరిగే వారు.

అనేక జిల్లాలలో కూడా పర్యటించారు. కేంద్రంలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో ఆయన దానిపై ఆశలు పెట్టుకున్నారు.తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రివర్గ సభ్యుడున్నా, ఏపీ నుంచి ఎవరూ లేరు. దీంతో ఏపీ నుంచి ఒకరికి అవకాశం ఇస్తారంటున్నారు. కానీ మొన్నటి వరకూ కేంద్ర మంత్రివర్గంలోకి సుజనాచౌదరి ని తీసుకుంటారని భావించారు. కానీ ఇప్పుడు సుజనా పేరును పక్కన పెట్టేశారంటున్నారు.దీనికి కారణం సుజనా చౌదరిపై టీడీపీ బ్రాండ్ చెరగకపోవడమే. దీనికితోడు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టారు. కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. సుజనా చౌదరికి మంత్రి పదవి ఏపీ నుంచి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావించినా సోము ఖచ్చితంగా అభ్యంతరం తెలుపుతారు.

సోము వీర్రాజు ఏపీ బీజేపీలో టిడిపి వాసనలను పూర్తిగా కడిగేయాలని కంకణం కట్టుకున్నారు.ముఖ్యంగా సుజనాచౌదరి అంటే సోము వీర్రాజు భగ్గుమంటున్నారు.ఆయన వర్గీయులకి బిజెపి రాష్ట్ర కమిటీలో స్థానం కూడా ఇవ్వలేదు.అలాగే ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీ జీవీఎల్ వంటి వారు కూడా సుజనాచౌదరికి పదవిస్తే అంగీరించే పరిస్థితి లేదు. అందుకే సుజనా చౌదరి సోము వచ్చిన నాటి నుంచి సైలెంట్ గా ఉన్నారంటున్నారు. మంత్రి పదవి మీద మాత్రం సుజనా చౌదరి పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్లేనంటున్నారు. ఇలా సుజనా చౌదరికి వ్రతం చెడ్డా ఫలం దక్కని పరిస్థితి ఎదురైంది.

author avatar
Yandamuri

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N