ట్రెండింగ్ న్యూస్

Somu Veerraju: నచ్చినప్పుడు చంద్రబాబు లవ్ చేస్తాడు.. తర్వాత బ్రేకప్ చెబుతాడు అంటూ సోము సెటైర్లు..!!

Share

Somu Veerraju: టీడీపీ – జనసేన పొత్తు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు కానీ ఆ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీ స్పందించింది. పూర్వాశ్రమంలో టీడీపీతో రెండు సార్లు జతకట్టి విడిపోయిన అనుభవం బీజేపీకి ఉంది. ఈ తరుణంలో ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. లవ్ చేయడం, బ్రేకప్ చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారుసోము వీర్రాజు. చంద్రబాబు ఒక అవకాశ వాది. ఎవరినైనా లవ్ చేస్తారు తర్వాత వదిలేస్తారు అంటూ వ్యాఖ్యానించారు.

Somu Veerraju: Commented on Chandrababu naiyudu
Somu Veerraju: Commented on Chandrababu naiyudu

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుండే పొత్తులు, ఎత్తులపై ఊహాగానాలు మొదలైయ్యాయి. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును జనసేనతో పొత్తు అంశంపై ఓ కార్యకర్త ప్రశ్నించగా వన్ సైడ్ లవ్ చేస్తే ఉపయోగం ఉండదన్నారు. లవ్ రెండు వైపులా ఉండాలంటూ చలోక్తి విసిరారు. ఈ కామెంట్స్ పై సోము వీర్రాజు నేడు స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారనీ తర్వాత వదిలివేస్తారని అన్నారు. లవ్ చేయడం, వదిలివేయడం ఆయన నైజం అని విమర్శించారు. 1996లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి.. అప్పటి నుండి అన్ని పార్టీలతో లవ్ చేస్తున్నారని తర్వాత ఆయనేమిటో చూపించారని అన్నారు.

 

2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీలో టీడీపీతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ టీడీపీ భాగస్వామ్యం అయ్యింది. ఏపిలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అయింది. ప్రత్యేక హోదా డిమాండ్ తో 2018 లో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం జనసేనను వదిలివేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బీజేపీతో దోస్తీ కటీఫ్ చెప్పడానికి జనసేన సిద్ధంగా లేదు. కాకపోతే టీడీపీతో దగ్గర అయ్యేందుకు జనసేన సముఖతగా ఉండగా బీజేపీ ససేమిరా అంటోంది. చూడాలి ఏమి జరుగుతుందో.


Share

Related posts

గొప్ప థ్రిల్ కావలినిపిస్తుందా? అయితే ఈ ప్రదేశానికి వెళ్ళండి.

Kumar

YS Viveka Murder Case: వివేకా కేసులో కోర్టు ముందుకు రెండో వ్యక్తి ..! కోర్టు హాలులో సెన్షేషనల్ కామెంట్లు..?

Srinivas Manem

ఉత్తమ హీరో ! ఉత్తమ విలన్ ! ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ …అన్నీ చంద్రబాబే !!

Yandamuri