Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క ఇండస్ట్రీ పెద్దగా సినీ కార్మికులకు మంచి చేస్తూనే మరో పక్క కెరియర్ పరంగా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే రీతిలో సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోవడంతో.. ఇక వరుసగా ఒప్పుకున్న ప్రాజెక్టుల పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవల ముగిసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవ్వటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటింపజేయడానికి… బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరోయిన్ నీ రంగంలోకి దింపాలని బాబు ఆలోచన చేసినట్లు లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళితే చిరంజీవి పక్కన అదే తరహాలో కనబడే రీతిలో.. ఉండే పర్సనాలిటీ కలిగిన హీరోయిన్ సోనాక్షి అని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు టాక్.
Read More: Aacharya: “ఆచార్య” కి క్లైమాక్స్ అదిరిపోయే ప్లాన్ సెట్ చేసిన కొరటాల -రామ్ చరణ్..??
చిరంజీవి పక్కన కావటంతో సోనాక్షి కూడా ఓకే అన్నట్లు.. దక్షిణాదిలో కూడా సినిమాలు చేయడానికి ఆమె ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇటీవల బాలీవుడ్ మీడియా వర్గాలలో కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో బాబీ.. చిరంజీవి కోసం సోనాక్షిని సెలెక్ట్ చేసినట్లు వార్తలు రావడంతో.. ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే మరో పక్క చిరంజీవి.. “ఆచార్య” సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ పూర్తి అయిన వెంటనే.. బయట పరిస్థితులను అంచనా వేసుకుని వీలైనంత త్వరగా .. ఆచార్య థియేటర్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.