Sonakshi sinha : మెగాస్టార్ సినిమాకి భారీ రెమ్యునరేషన్ అడిగిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Share

Sonakshi sinha: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలో హీరోయిన్ అంటే ముందు రెమ్యునరేషన్ గురించి మాట్లాడని వారే ఎక్కువ మంది ఉంటారు. కానీ బాలీవుడ్ వాళ్ళకి అలాంటి పట్టింపులేవీ ఉండవని మరోసారి ప్రూవ్ అయింది. స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ ఎవరైనా మన సౌత్ లో వచ్చి సినిమా చేయాలంటే బాగానే డిమాండ్ చేస్తారు. అందుకు కారణం బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. దాంతో పోల్చుకుంటే
మన మార్కెట్ కాస్త తక్కువే. అందుకే వారు అదే దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ అడుగుతారు.

sonakshi-sinha-asked for high remuniration
sonakshi-sinha-asked for high remuniration

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇలానే ఓ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తే భారీగా డిమాండ్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా నట వారసురాలుగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా ద్వారాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమా తర్వాత అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్స్ సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇక సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన లింగ సినిమాలో నటించి సౌత్ లో ఎంట్రీ ఇచ్చింది.

Sonakshi sinha: సోనాక్షి సిన్హాకి బాలీవుడ్ లో తనకున్న క్రేజ్ తో చూసుకుంటే ఈ రెమ్యునరేషన్ తక్కువే.

ఈ సినిమా తర్వాత మళ్ళీ కనిపించని సోనాక్షి సిన్హా ఇంతకాలానికి బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాకి సంప్రదించారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీని సంప్రదించగా, 3.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. బాలీవుడ్ లో తనకున్న క్రేజ్ తో చూసుకుంటే ఈ రెమ్యునరేషన్ తక్కువే. మరి మనవాళ్ళు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకు వస్తారా లేదా అనేది త్వరలో తెలియనుంది. కాగా మెగాస్టార్ ఆచార్య పూర్తి చేశారు. త్వరలో మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ సినిమాతో సెట్స్ పైకి రానున్నారు.


Share

Related posts

హాట్ హాట్ ఫోటో తో కుర్రాళ్ళ మతులు పోగొట్టిన సమంత !

Naina

బ్రేకింగ్ : బిగ్ బాస్ లోకి ఆర్జివి యాంకర్..! బోల్డ్ గానే ఉంటాను అంటోంది

Arun BRK

Ysrcp : బాలయ్య సమక్షములో భారీగా టిడిపి లోకి వైసీపీ మద్దతుదారులు..!!

sekhar