కరోనా కల్లోలం సృష్టించిన సమయంలో ఎంతోమంది వలస కూలీలకు ప్రత్యేక బస్సులు, రైలు, విమానాలు ద్వారా తమ సొంత గ్రామాలకు చేరవేసిన సోనుసూద్ దేశవ్యాప్తంగా రియల్ హీరోగా మారాడు. కేవలం కరోనా సమయంలో మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడైనా ఎవరైనా సమస్యతో బాధపడుతున్నారని తన దృష్టికి వెళితే వెంటనే వారిని ఆదుకొని అందరి దృష్టిలో ప్రత్యేక స్థానాన్ని సోనుసూద్ సంపాదించారు. ఈ విధంగా నిరుపేదలకు సహాయం చేయడంతో అందరూ అతనిని ఒక దేవుని గా భావించి గుడి కూడా కట్టేశారు.
సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని కష్టాలలో ఉన్న వారికి సహాయం చేస్తూ తనదైన ముద్రను వేసుకున్న సోనుసూద్ ప్రస్తుతం మరోసారి ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.
కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల 15 నెలల వర్షిత అనే చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆపరేషన్ చేయించే అంత స్థోమత వారికి లేకపోవడం వల్ల దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ విషయాన్ని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా సోనుసూద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై స్పందించిన సోను సూద్ ముంబైలోని ఓ హాస్పిటల్లో పాపకు ఆపరేషన్ చేయించడానికి అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయలను అందజేసి పాపకు గుండె చికిత్స చేయించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి మునుకుల్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తన కూతురిని ఆదుకున్న సోనూసూద్ కు వర్షిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విధంగా ఆ చిన్నారి ఆపరేషన్ కు సహాయం చేసి మరో సారి సోను సూద్ అందరిచేత రియల్ హీరో అనిపించుకున్నారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…